హోరాహోరీగా హాకీ పోటీలు
హోరాహోరీగా హాకీ పోటీలు
Published Sun, Oct 9 2016 12:53 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
నెల్లూరు(బృందావనం): నగరంలోని వీఆర్ ఉన్నత పాఠశాల మైదానంలో నాలుగు రోజులు జరిగే ఏడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సబ్‌జూనియర్ మెన్స్ అంతర్‌జిల్లా హాకీ చాంపియన్‌షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. తొలి రోజు జరిగిన పోటీలకు సంబంధించిన ఫలితాలను నిర్వాహకులు శనివారం రాత్రి ప్రకటించారు. నెల్లూరు జిల్లా జట్టు రెండు మ్యాచ్‌లో పాల్గొని ఆయా జట్లపై అలవోకగా నెగ్గింది. తొలిమ్యాచ్‌లో నెల్లూరు జట్టు ప్రకాశం జిల్లా జట్టును 5 – 0 గోల్స్ తేడాతో ఓటమిపాలు చేసింది. అనంతపురం– పశ్చిమగోదావరి జిల్లాల జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1 - 1 గోల్స్‌తో డ్రాగా ముగిసింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 1 - 0 తేడాతో ప్రకాశం జట్టు గెలుపొందింది. చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చిత్తూరు జట్టు 7 – 0 గోల్స్‌తో విజయం సాధించింది. విశాఖపట్నం, కృష్ణా జిల్లాల జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కృష్ణా జిల్లా 2 – 1 గోల్స్ తేడాతో గెలుపొందింది. అనంతపురం, కర్నూలు జిల్లాల జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అనంతపురం జట్టు 6 – 1 గోల్స్ తేడాతో గెలుపొందింది. తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చిత్తూరు జిల్లా జట్టు 6 – 0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. వైఎస్సార్ కడప, కృష్ణా జిల్లాల జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వైఎస్సార్ కడప జిల్లా జట్టు 2 - 1 గోల్స్ తేడాతో నెగ్గింది. నెల్లూరు – గుంటూరు జిల్లాల మధ్య జరిగిన మ్యాచ్‌లో నెల్లూరు జట్టు 10 – 0 గోల్స్ తేడాతో విజయం సాధించింది.
Advertisement
Advertisement