నేటి నుంచి రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్‌ హాకీ పోటీలు | Sub junior hockey tourney | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్‌ హాకీ పోటీలు

Published Fri, Oct 7 2016 1:04 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

నేటి నుంచి రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్‌ హాకీ పోటీలు - Sakshi

నేటి నుంచి రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్‌ హాకీ పోటీలు

 
  • 13 జిల్లాల నుంచి 200మంది క్రీడాకారుల రాక
  • -హాకీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్‌రెడ్డి
 
నెల్లూరు(బృందావనం): నగరంలోని వీఆర్‌ ఉన్నత పాఠశాల మైదానంలో  శుక్రవారం నుంచి నాలుగురోజుల పాటు 7వ రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్‌ పురుషుల హాకీ చాంపియన్‌ షిప్‌ పోటీలను నిర్వహిస్తున్నట్లు హాకీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్‌రెడ్డి తెలిపారు. స్థానిక వీఆర్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గురువారం ఆయన హాకీ టోర్నమెంట్‌ ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 13 జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు హాజరవుతున్నట్లు తెలిపారు. హాకీ జిల్లా అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై శేషయ్య, థామస్‌పీటర్‌ మాట్లాడుతూ ధ్యాన్‌చంద్‌ హాకీ క్లబ్‌ ఆధ్వర్యంలో క్రీడాకారులకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో ఒలింపిక్‌ అసోసియేషన్‌ కోశాధికారి పసుపులేటి రామమూర్తి, జిల్లా అటవీశాఖ అధికారి బీ చాణక్యరాజ్‌, టోర్నమెంట్‌ డైరెక్టర్‌ జానకిరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement