‘మిషన్’ చెరువుకు బుంగ
ఎల్కతుర్తి: మండల కేంద్రంలోని మిషన్ కాకతీయ ఊర చెరువుకు బుంగపడడంతో నీరంతా వృథాగా పోతుంది. దీంతో ఆయకట్టు రైతులు గురువారం చెరువుపై ఆందోళనకు దిగారు. చెరువుకు బుంగపడడం ఇది మూడోసారి. చెరువు మరమ్మతు పనుల్లో నాణ్యత పాటించకపోవడంతోనే తరచూ బుంగలు పడుతున్నాయని రైతులు అన్నారు. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ కక్కుర్తితో చెరువు ఖాళీ అయ్యేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులను సస్పెండ్ చేయాలని కోరారు. రైతు సమాఖ్యసంఘాల గ్రామ అధ్యక్షుడు అంబాల అయిలయ్య, నగేశ్, రాజమౌళి, సంపత్, రాజయ్య, మల్లేశ్, రమేశ్, రాజు, మహిమెుద్దీన్, కర్రె భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.