వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య
Published Wed, Aug 17 2016 1:18 AM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM
నూతనకల్: ప్రియుడితో కలిసి భార్య వేధిస్తుండడంతో విసుగు చెందిన భర్త సోమవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని బిక్కుమళ్ల గ్రామంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బొల్లెపల్లి శ్రీరంగం కుమారుడు బొల్లెపల్లి శ్రీనివాస్(35)కు అదే గ్రామానికి చెందిన కప్పల నర్సయ్య కుమార్తె గీతను ఇచ్చి 18సంవత్సరాల క్రితం వివాహాం జరిపించారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుని భార్య గీత ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తుంది. అదే గ్రామానికి చెందిన పోలోజు వెంకటచారితో అక్రమ సంబంధం ఏర్పరుచుకుంది. భార్యభర్తల మధ్య తరచూ వివాదాలు జరుగుతుండడంతో నాలుగేళ్లుగా గీత తన తల్లిగారి ఇంటి వద్ద ఉంటుంది. మృతుడు పెద్ద మనషుల సమక్షంలో పంచాయితీ పరిష్కారం చేసుకోవడంతో నెల రోజుల నుంచిlకలిసి ఉంటున్నారు. అయితే తరచూ భర్తను చూటిపోటు మాటలతో వేధిస్తుండడంతో పాటు సక్రమంగా చూసుకోవడం లేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన శ్రీనివాస్ సోమవారం రాత్రి తన భార్య, కూతురు ఇంటి స్లాబ్‌పై నిద్రిస్తున్న సమయంలో స్లాబ్ కొక్కానికి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం భార్య, తలుపులు తెరవగా ఉరివేసుకొని ఉండడంతో కేకలు వేశారు. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి మృతదేహాన్ని కిందకు దించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు భార్య గీత, ప్రియుడు వెంకటచారిపై కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఎచ్‌ఓ కె. అంజన్‌రెడ్డి తెలిపారు.
Advertisement
Advertisement