'ఆ జంట హత్యలతో నాకు సంబంధం లేదు' | I am not involved in that murders, says Vykuntam Prabhakar Chowdary | Sakshi
Sakshi News home page

'ఆ జంట హత్యలతో నాకు సంబంధం లేదు'

Published Fri, Jul 22 2016 9:15 AM | Last Updated on Mon, Sep 4 2017 5:51 AM

'ఆ జంట హత్యలతో నాకు సంబంధం లేదు'

'ఆ జంట హత్యలతో నాకు సంబంధం లేదు'

అనంతపురం : రుద్రంపేట జంట హత్యలతో నాకు సంబంధంలేదని ఎమ్మెల్యే వి.ప్రభాకర్ చౌదరి అన్నారు. నేను ఫ్యాక్షన్ వ్యతిరేకినని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం అనంతపురంలో ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ.. ఈ కేసుపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. జంట హత్యలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.

నాపై రక్తపు మరకలు అంటించే ప్రయత్నం చేస్తున్నారని ప్రత్యర్థులపై ప్రభాకర్ చౌదరి మండిపడ్డారు. అనంతలో అరాచకాలకు వ్యతిరేకంగా నేను ముందు నుంచి పోరాడుతున్నానని ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement