ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడంలేదు: ప్రత్యూష
హైదరాబాద్ : ఎల్బీనగర్లో సవతి తల్లి వేధింపులతో తీవ్రగాయాలపాలైన ప్రత్యూష(16) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తాను ఎక్కడికి వెళ్లాలో తేల్చుకోలేని ఆయోమయ పరిస్థితిలో ఉంది. నగరంలోని సాగర్ ప్రధాన రహదారిలో ఉన్న అవేర్ గ్లోబల్ ఆప్పత్రిలో చికిత్స పొందుతున్న ప్ర్యత్యూష కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. తనకు పునరావాసం కల్పించి చదువుకోవడానికి అవకాశం కల్పించాలని బాధితురాలు ప్రత్యూష కోరుతోంది. తనను అంతం చేయడానికి పిన్ని, తండ్రి కుట్రపన్నారని ఆరోపించింది.
తనను చూసేందుకు ఇప్పటి వరకు ఏ ఒక్కరూ రాలేదని ప్రత్యూష బాధపడుతోంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు తనకు ఇష్టం లేదని అంటోంది. న్యాయమూర్తి జస్టిస్ కోదండరాం మీడియా కథనాలపై స్పందించి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బాబా సాహెబ్ బోసాలేకు లేఖ రాయడంతో రెండు రోజుల క్రితమే ప్రత్యూష కేసును సుమోటోగా హైకోర్టు స్వీకరించిన విషయం విదితమే. కాసేపట్లో ప్రత్యూష కేసు హైకోర్టులో విచారణకు రానుంది.