aware global hospital
-
ప్రత్యూషకు కేసీఆర్ దంపతుల పరామర్శ
హైదరాబాద్: సవతి తల్లి, కన్న తండ్రి చేతుల్లో చిత్రహింసలకు గురై తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతున్న ప్రత్యూషను తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పరామర్శించారు. శనివారం మధ్యాహ్నం సరూర్ నగర్ లోని అవేర్ గ్లోబల్ హాస్పిటల్‌కు కేసీఆర్ దంపతులు వెళ్లారు. కేసీఆర్ దంపతులతో పాటు వారి కుమార్తె, ఎంపీ కవిత కూడా వచ్చారు. ప్రత్యూష ఆరోగ్య పరిస్థితి గురించి కేసీఆర్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యూషకు సంబంధించి అన్ని విషయాలను ప్రభుత్వం తరపున తానే పర్యవేక్షిస్తానని కేసీఆర్ చెప్పారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రత్యూషను కేసీఆర్ దంపతులు కలవాల్సి ఉన్నా నగరంలో పుష్కరాల వాహనాల కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ జామ్ తో ఆయన ఈ కార్యక్రమాన్ని మధ్యాహ్నానికి వాయిదా వేసుకున్నారు. ప్రత్యూషను అన్ని విధాలా ఆదుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి స్వయంగా ఆస్పత్రికి వచ్చి ఓ సామాన్యురాలిని పరామర్శించడం.. అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇవ్వడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు. మీడియాలో ప్రత్యూషపై వచ్చిన కథనాలు చూసి చలించిపోయిన కేసీఆర్ అధికారుల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు. తల్లిని కోల్పోయిన ప్రత్యూషను ఎవరూ చేరదీయకపోవడం పట్ల సీఎం కేసీఆర్ ఆవేదన చెందారు. సవతి తల్లి, కన్నతండ్రి పెట్టిన చిత్రహింసలు భరిస్తూ ఆమె నరకం చూసిందంటూ ఇంతకుముందు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా ప్రత్యూష పరిస్థితి తనకు తరచూ గుర్తుకొస్తోందన్నారు. దీంతో ప్రత్యూష కు సంబంధించిన అన్ని విషయాలను ఇకపై ప్రభుత్వం తరపున తానే పర్యవేక్షిస్తానని చెప్పారు. -
మ.3 గంటలకు ప్రత్యూషను కలవనున్నకేసీఆర్
హైదరాబాద్: సవతి తల్లి, కన్న తండ్రి చేతుల్లో చిత్రహింసలకు గురై తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతున్న ప్రత్యూషను సీఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సతీసమేతంగా కలవనున్నారు. కాగా మీడియాలో ప్రత్యూషపై వచ్చిన కథనాలు చూసి కేసీఆర్ చలించిపోయారు. అధికారుల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు. తల్లిని కోల్పోయిన ప్రత్యూషను ఎవరూ చేరదీయకపోవడం పట్ల సీఎం కేసీఆర్ ఆవేదన చెందారు. సవతి తల్లి, కన్నతండ్రి పెట్టిన చిత్రహింసలు భరిస్తూ ఆమె నరకం చూసిందంటూ శుక్రవారం ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా ప్రత్యూష పరిస్థితి తనకు తరచూ గుర్తుకొస్తోందన్నారు. దీంతో ప్రత్యూష కు సంబంధించిన అన్ని విషయాలను ఇకపై ప్రభుత్వం తరపున తానే పర్యవేక్షిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం సరూర్ నగర్ లోని అవేర్ గ్లోబల్ హాస్పిటల్ లో చికిత్ప పొందుతున్న ప్రత్యూషను ఆయన కలవనున్నారు. కాగా ఉదయం 10 గంటలకు ప్రత్యూషను కేసీఆర్ దంపతులు కలవాల్సి ఉన్నా నగరంలో పుష్కరాల వాహనాల కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ జామ్ తో ఆయన ఈ కార్యక్రమాన్ని మధ్యాహ్నానికి వాయిదా వేసుకున్నారు. కాగా నగర శివార్లలో ఏర్పడిన ట్రాఫిక్ ను క్రమబద్దీకరించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వారాంతంతో పుష్కరాలకు భక్తుల రద్దీ పెరగడంతో పుష్కర ఏర్పాట్లపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. టోల్ గేట్ల వద్ద ఆలస్యం జరగకుండా చూడాలన్నారు. ఘాట్ల వద్ద భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 24 గంటల పాటు ఘాట్ల వద్ద గజ ఈతగాళ్లు , పడవలు అందుబాటులో ఉంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. -
మేం చెప్పే వరకు ఆసుపత్రిలోనే ప్రత్యూష
సాక్షి, హైదరాబాద్: ‘మేం చెప్పే వరకు ప్రత్యూషను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయకుండా చర్యలు తీసుకోవాలి.’ అని హైకోర్టు గురువారం రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రత్యూషకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్న అవేర్ గ్లోబల్ ఆసుపత్రి డాక్టర్లను, సిబ్బందిని హైకోర్టు అభినందించింది. ఆమె సంరక్షణ విషయాలను చర్చించేందుకు ఆమె పెద్దనాన్న కోర్టు ముందు హాజరయ్యేలా చూడాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్‌కు సూచించింది. అన్ని కోణాల్లో పూర్తి వివరాలను తెలుసుకున్న తరువాతే ఆ యువతి భవిష్యత్తు గురించి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యూషను ఆమె సవతి తల్లి తీవ్రంగా హింసించి ఆమె చేత యాసిడ్ తదితర ప్రమాదకర రసాయనాలు తాగించినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలపై చలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలేకు లేఖ రాశారు. దీనిని సుమోటో పిటిషన్‌గా పరిగణించి విచారించాలని కోరారు. దీనికి అంగీకరించిన జస్టిస్ బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్‌తో కలిసి విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యాన్ని గురువారం జస్టిస్ బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారించింది. ప్రత్యూష ఆరోగ్య పరిస్థితిపై నివేదికను స్పెషల్ జీపీ శరత్‌కుమార్ ధర్మాసనం ముందుంచారు. ప్రత్యూష తండ్రి రమేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని, ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, శరీరంపై ఉన్న గాయాలు మానుతున్నాయని తెలిపారు. అవేర్ ఆసుపత్రి ఉచితంగా చికిత్సను అందిస్తోందని, రెండు, మూడు రోజుల్లో ఆమెను డిశ్చార్జ్ చేయవచ్చని డాక్టర్లు తెలిపారని ఆయన వివరించారు. ప్రత్యూష వద్దకు ఆమె పెద్దమ్మ, పెద్దనాన్న వచ్చి వెళ్లారని శరత్‌కుమార్ చెప్పడంతో, అయితే ఆమె పెద్దనాన్నను శుక్రవారం కోర్టు ముందు హాజరయ్యేలా చూడాలని ధర్మాసనం ఆదేశించింది. -
అన్నివిధాలా ఆదుకుంటాం: పొంగులేటి
హైదరాబాద్: అవేర్‌గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ఆమెకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రత్యూష నర్సింగ్ కోర్సు పూర్తి చేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్నదని ఆమెకు వైఎస్ఆర్సీపీ అండగా ఉండి చేయూత నంది స్తుందన్నారు. గతంలో ఆమె గర్ల్స్ స్టేట్ హోంలో ఆశ్రయం పొందిందని అక్కడ కూడా సరైన వసతులు లేవన్న సంగతి బాధితురాలి ఆవేదన ఆధారంగా తనకు తెలిసిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పం దించి తగిన వసతులు కల్పించాలని కోరా రు. ప్రత్యూషకు ఉచిత వైద్య సేవలందిం చిన ఆసుపత్రి యాజమాన్యంతో పాటు అండగా నిలబడిన బాలల హక్కుల కమిషన్ సభ్యుడు అచ్యుతరావు, బాలల హక్కు ల సంఘం అధ్యక్షురాలు అనూరాధలను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. -
ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడంలేదు: ప్రత్యూష
హైదరాబాద్ : ఎల్బీనగర్లో సవతి తల్లి వేధింపులతో తీవ్రగాయాలపాలైన ప్రత్యూష(16) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తాను ఎక్కడికి వెళ్లాలో తేల్చుకోలేని ఆయోమయ పరిస్థితిలో ఉంది. నగరంలోని సాగర్ ప్రధాన రహదారిలో ఉన్న అవేర్ గ్లోబల్ ఆప్పత్రిలో చికిత్స పొందుతున్న ప్ర్యత్యూష కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. తనకు పునరావాసం కల్పించి చదువుకోవడానికి అవకాశం కల్పించాలని బాధితురాలు ప్రత్యూష కోరుతోంది. తనను అంతం చేయడానికి పిన్ని, తండ్రి కుట్రపన్నారని ఆరోపించింది. తనను చూసేందుకు ఇప్పటి వరకు ఏ ఒక్కరూ రాలేదని ప్రత్యూష బాధపడుతోంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు తనకు ఇష్టం లేదని అంటోంది. న్యాయమూర్తి జస్టిస్ కోదండరాం మీడియా కథనాలపై స్పందించి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బాబా సాహెబ్ బోసాలేకు లేఖ రాయడంతో రెండు రోజుల క్రితమే ప్రత్యూష కేసును సుమోటోగా హైకోర్టు స్వీకరించిన విషయం విదితమే. కాసేపట్లో ప్రత్యూష కేసు హైకోర్టులో విచారణకు రానుంది. -
ప్రత్యూషను...ఆదుకునేదెవరు...?
♦ ఒంటిపై పలు గాయాలు, శరీరంలో లోపల పుండ్లు ♦ సవతి తల్లి ఘాతుకానికి బలైన యువతి దైన్యం ♦ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని ప్రజా సంఘాల విస్మయం సాక్షి, హైదరాబాద్ : సవతితల్లి వేధింపులతో తీవ్ర గాయాల పాలైన ప్రత్యూష(16) ఆరోగ్య పరిస్థితి చూసి వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సాగర్ హైవేలోని అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూష శరీరంపై అంగుళం కూడా ఖాళీ లేకుండా గాయాలు, వాతలు, శరీరం లోపల పుండ్లు అయినట్టు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం రీనల్ ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్న ప్రత్యూష మొహంపైనే యాసిడ్‌తో దాడిచేసిన మచ్చ, గొంతులో యాసిడ్ వల్ల ఏర్పడిన గాయాలు, శరీరంపై చెప్పలేని ప్రాంతాల్లో సహా అన్ని భాగాల్లో సిగరెట్లతో కాల్చిన వాతలు, తలను గోడకు మోదడంతో ఏర్పడినవి, ఆమె దయనీయతను తెలియజేస్తున్నాయి. ‘యాసిడ్, హర్పిక్ వంటివి తాగించడం వల్ల నాలుక కమిలిపోయింది. మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. కండరాలు వాచిపోయాయి. రక్తహీనతతో బాధపడుతోంది. ఎప్పటికప్పుడు రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఉంది. ఛాతీలో నీరు ఉండటం వల్ల ఆయాసం వస్తోంది. కుడి భుజం వద్ద కొట్టిన దెబ్బలతో రక్తం గడ్డకట్టుకుపోయింది. చెవుల నుంచి నిరంతరాయంగా చీము వస్తుంది’ అని ప్రత్యూషకు చికిత్స అందిస్తున్న వైద్యులు వెల్లడించారు. కోలుకోవాలంటే నెలరోజులు ప్రత్యూష మళ్లీ మామూలుగా కావాలంటే దాదాపు నెల రోజులు సమయం పట్టే అవకాశం కనబడుతోంది. అప్పటివరకు ఆమెకు ప్రత్యేక వైద్యం అవసరమని డాక్టర్లు అంటున్నారు. ఆ తర్వాత ఆమెకు మరో నెలరోజుల పాటు మానసిక చికిత్స చేయాలి. ఇక ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక ఎక్కడికెళ్లాలో కూడా తెలియని పరిస్థితి. తల్లి చనిపోయింది. చిత్రహింసలు పెట్టిన మారుతల్లి చాముండేశ్వరి రిమాండులో ఉంది. తండ్రి రమేష్ పరారయ్యాడు. ఇలా ఎవరూలేని ప్రత్యూషకు మరో ఆరు నెలల పాటు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంది. అటు నా అన్నవాళ్లు ఎవరూ లేకపోవడంతో పాటు వైద్యానికి అవసరమయ్యే ఖర్చులు ఆమెకు ఎలా అన్నది ప్రశ్నార్థకం కానుంది. ఇప్పటివరకు బాలల హక్కుల సంఘం అండగా నిలబడింది. ఇకపై ఎలా అన్నదే అందర్నీ వేధిస్తోంది. ప్రభుత్వం తీరుపై సంఘాల విస్మయం కుటుంబీకుల చేతిలో క్రూరంగా హింసకు గురై ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ప్రత్యూషను ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎవరూ వచ్చి పరామర్శించకపోవడంపై పలు ప్రజా సంఘా లు విస్మయం వ్యక్తం చేశాయి. ఆర్థికంగా అదుకుంటారని అనుకుంటున్న ప్రజాప్రతినిథులు ఆవైపుగా చూడకపోవడంపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రత్యూషకు ఆర్థికంగా అండగా నిలవాలని అవి కోరుతున్నాయి. -
అయ్యో పాపం!.
-
యాసిడ్ తాగించి, సిగరెట్లతో కాల్చి...
-
యాసిడ్ తాగించి, సిగరెట్లతో కాల్చి...
హైదరాబాద్ : సవతి తల్లి చేతిలో చిత్ర హింసలకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూష ఆరోగ్యంపై అవేర్ ఆస్పత్రి వైద్యులు శుక్రవారం హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ప్రత్యూష ఆరోగ్యం నిలకడగానే ఉందని, వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. ఆమె శరీరంపై బలమైన గాయాలు ఉన్నాయని, అన్నింటికీ చికిత్స చేసినట్లు చెప్పారు. ఆమె అంతర్గత (ప్రయివేట్ పార్ట్స్)అవయవాలపై యాసిడ్‌తో దాడి చేశారని, సిగరెట్లతో కాల్చి, యాసిడ్ కూడా తాగించినట్లు అవేర్ వైద్యులు వెల్లడించారు. సకాలంలో ప్రత్యూషను పోలీసులు ఆస్పత్రికి తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని చెప్పారు. సవతి తల్లి చాముండేశ్వరి ఏడాది కాలంగా ప్రత్యూష గదిలో నిర్బంధించి చిత్రహింసలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న మానవ హక్కుల కమిషన్, పోలీసులు బాధితురాలి ఇంటిపై దాడిచేసి ఆమెను బుధవారం గృహనిర్బంధం నుంచి విముక్తి కలిగించిన సంగతీ విదితమే. ప్రస్తుతం ప్రత్యూషకు రీనల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి, గ్యాస్ట్రో, గైనకాలజీ, పల్మనాలజీ విభాగాల వైద్యులతో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను బంధువులు కూడా పట్టించుకోవటం లేదు.