ఇదేం తీరయా.. | idem tiraya | Sakshi
Sakshi News home page

ఇదేం తీరయా..

Published Sun, Oct 9 2016 9:59 PM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM

ఇదేం తీరయా..

ఇదేం తీరయా..

–అభివృద్ధి ఎండమావేనా! 
–కీలక ప్రాజెక్టులు హామీలకే పరిమితం   
–తీరంపై సర్కారు చిన్నచూపు 
 
జిల్లాలో 19 కిలోమీటర్ల మేర విస్తరించిన తీరప్రాంతం అభివద్ధి ఎండమావిలా మారింది. ఈ ప్రాంతాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. ఫలితంగా ఈ ప్రాంతవాసులు ఇదేం ‘తీర’ని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
నరసాపురం : జిల్లాలో నరసాపురం పరిసరాల్లో తీరప్రాంతం విస్తరించింది. ఇక్కడ అభివద్ధి జరిగితే ఆ ఫలాలు జిల్లా అంతటా అందే అవకాశం ఉందనే భావన ఈ ప్రాంత ప్రజల్లో బలంగా ఉంది. దీంతో రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గతంలో హామీలు గుప్పించాయి. తీరానికి మహర్దశ తీసుకొస్తామని జోరుగా ప్రచారం చేశాయి. ఆ తర్వాత ఆ హామీలకు తూట్లు పొడిచాయి. కీలక ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టాయి.    
సోలార్‌సిటీ, పోర్టుల నిర్మాణం ఎక్కడ!
కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ చొరవతో రాష్ట్రంలోని విజయవాడతోపాటు, నరసాపురం పట్టణాన్ని సోలార్‌సిటీలుగా అభివద్ధిచేస్తామని కేంద్రం ప్రకటించింది. రానున్న ఐదేళ్లలో రూ.150 కోట్ల నుంచి రూ.300 కోట్లు ఖర్చుపెట్టి సోలార్‌సిటీలను అభివద్ధి చేస్తామని పేర్కొంది. దీనిలో భాగంగా డీపీఆర్‌(డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు) నిమిత్తం నరసాపురం మునిసిపాలిటీకి తొలి విడతగా రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్టు, కేంద్ర మంత్రి సీతారామన్‌ ఆరునెలల క్రితం  ప్రకటించారు. కానీ ఇంతవరకూ నిధులు రాలేదు. తీరంలో కేంద్రం సహకారంతో పోర్టు నిర్మిస్తామని గత ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఆ ఊసే మరిచిపోయారు.
వశిష్ట వంతెనదీ అదే దారి
 మరో కేంద్ర ప్రాజెక్ట్‌ వశిష్ట వంతెనదీ అదే దారి.  అంతర్వేదిలో నిర్మిస్తున్న డ్రెడ్జింగ్‌ హార్బర్‌ నిధుల్లో రూ.200 కోట్లు ఈ వంతెనకు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరికి లేఖరాసి డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ నిధులతో వశిష్ట వంతెన పూర్తి చేయాలని కోరారు. ఆ లేఖను స్థానిక ఎమ్మెల్యే పత్రికలకు విడుదల చేసి హడావిడి చేశారు. ఆ తర్వాత ఈ అంశం ఎంత వరకూ వచ్చిందో కూడా ఎవరికీ తెలీదు.  
స్థానిక నేతలు కీలకస్థానాల్లో ఉన్నా.. 
ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కొందరు కీలకస్థానాల్లో ఉన్నా.. ఈ ప్రాతానికి పెద్దగా ఒరిగిందేమీ లేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ నరసాపురం కోడలు. ఆమె భర్త పరకాల ప్రభాకర్‌ కేబినెట్‌ హోదాలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. S విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్మన్‌ జస్టిస్‌ గ్రంధి భవానీప్రసాద్‌ది కూడా నరసాపురమే. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు స్పందించిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ నరసాపురం మండలంలో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు  రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చిరంజీవి కూడా పేరుపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అయితే ఈ ప్రాంత అభివద్ధి ఆశించినంతగా జరగలేదు. ముఖ్యంగా హార్బర్‌ నిర్మాణం, వశిష్ట వంతెనతో పాటుగా  తీరప్రాంతం కోతకు గురికాకుండా రక్షణ చర్యలు, గ్యాస్‌ ఆధారిత పరిశ్రమల స్థాపన వంటి చిరకాల ఆకాంక్షలూ నెరవేరలేదు. ఏడాది క్రితమే పనులు మొదలు పెడతామని చెప్పిన 216 జాతీయరహదారి విస్తరణ కూడా ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. 
–గతంలోనూ ఇలాగే..!
తీర ప్రాంత అభివద్ధి విషయంలో గతంలోనూ ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు హామీలిచ్చి చేతులు దులుపుకున్నారు. గతంలో వాజ్‌పేయ్‌ నేతత్వంలోనే ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కష్ణంరాజు ఇక్క ప్రై వేట్‌ పవర్‌ప్రాజెక్ట్‌ నెలకొల్పుతామని ఇచ్చిన హామీ కలగానే మిగిలింది. ఆ తర్వాత ఇక్కడ ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన కనుమూరి బాపిరాజు కూడా పవర్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు అంటూ హడావిడి చేశారు. దీనికోసం  చైనాకు చెందిన ఓ ప్రై వేట్‌ సంస్థ ప్రతినిధులు 2005లో ఇక్కడ పర్యటించారు కూడా. కానీ ఫలితం శూన్యం.  
 హామీలు నిలబెట్టుకోవాలి 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. రాష్ట్రవిభజన నేపథ్యంలో నరసాపురం తీరప్రాంతంలో అభివద్ది అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలో తీరప్రాంతం ఇక్కడే ఉంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో వశిష్టవంతెన నిర్మాణానికి జీవో విడుదల చేశారు. దురదష్టవశాత్తు ఆయన మరణించడంతో వంతెన నిర్మాణం ఆగిపోయింది.  
–ముదునూరి ప్రసాదరాజు, మాజీ ఎమ్మెల్యే
 అవకాశాలు ఎక్కువ  
తీరప్రాంతం కావడంతో.. ఇక్కడ అబివద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చమురు, సహజవాయువులకు ఈ ప్రాంతం గని వంటిది. గ్యాస్‌ ఆధారిత పరిశ్రమలు స్థాపనకు మంచి అవకాశం ఉంది. అది జరిగితే జిల్లా స్వరూపమే మారిపోతుంది. అవకాశాలను బట్టి అభివృద్ధి పనులు జరిపితే, బాగుంటుంది.
 – కె.చిదంబరం, హైకోర్టు న్యాయవాది  
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement