క్రీడల అభివృద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యం
Published Tue, May 2 2017 12:11 AM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM
సఖినేటిపల్లి :
నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అన్నారు. సోమవారం స్థానిక కుసుమ చినసుందరరావు క్రీడా ప్రాంగణంలో 17వ వార్షిక కాంతారావు మెమోరియల్ రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ తోటె ప్రతాప్‌కుమార్, అధ్యక్షుడు గొల్లమందల చిట్టిబాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా మాట్లాడారు. తొలి మ్యాచ్‌ను తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల జట్లు మధ్య జరిగింది. పోటీల్లో మొత్తం తొమ్మిది జిల్లాల కబడ్డీ క్రీడాకారులు పాల్గొంటున్నట్టు నిర్వాహకులు తెలిపారు. రాజోలు సబ్‌డివిజ¯ŒS నీటి సంఘ చైర్మ¯ŒS ఓగూరి విజయ్‌కుమార్, తహసీల్దార్ డీ జే సుధాకర్‌రాజు, ఎంపీటీసీ సభ్యురాలు గొల్లమందల జ్యోతి, సర్పంచ్‌లు రావి ధర్మరాజు, గెడ్డం పేర్రాజు, దొండపాటి అర్జునరావు, అంతర్వేది దేవస్థానం ట్రస్టీ వీరా మల్లిబాబు, మాజీ సర్పంచ్‌లు సరెళ్ల విజయ్ ప్రసాద్, ఈద రవిరెడ్డి, బత్తుల లక్ష్మణ్‌రావు, మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గెడ్డం తులసీభాస్కర్, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ ప్రతినిధి నల్లి డేవిడ్, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు ముప్పర్తి నాని, తదితరులు పాల్గొన్నారు.
Advertisement