సింగాపూర్‌లో సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి ఈటల రాజేందర్
-
విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట
-
రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్
హుజూరాబాద్ : ఇచ్చిన మాట ప్రకారం వచ్చే ఏడాదికి ఇంటింటికీ నల్లా నీరు ఇవ్వకపోతే ఓట్లు అడగమని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మండలంలోని సింగాపూర్‌లో రూ.1.25 కోట్లతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. ప్రతి పేదవాడికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కొద్ది మంది వ్యక్తులో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఒకరని గుర్తు చేశారు. సింగాపూర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. అర్హులందరికీ పింఛన్ అందిస్తామన్నారు. రూ.130 కోట్లతో ఎస్సారెస్పీ కాలువ మరమతు చేస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు రాకాసిగుండ్ల వద్ద మొక్కలు నాటారు. మండలంలోని తుమ్మనపల్లి, బోర్నపల్లి గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎంపీపీ వొడితల సరోజినీదేవి, మార్కెట్ చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, నగరపంచాయతీ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్, సర్పంచులు కౌరు రజిత, సుధాకర్, మాసాడి స్వరూప, సమ్మయ్య, తహసీల్దార్ జగత్‌సింగ్, ఎంపీడీవో ఉషశ్రీ పాల్గొన్నారు.