– డయల్ 100, 9989819191 కాల్స్‌పై ఎస్పీ సమీక్ష
అనంతపురం సెంట్రల్: ఆపదలో ఉన్న బాధితులకు సత్వరన్యాయం అందించడమే లక్ష్యంగా డయల్ 100, 99898 19191 విభాగాలు పనిచేయాలని ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ సూచించారు. జులై నెలలో ఆయా కాల్స్‌కు వచ్చిన ఫిర్యాదులపై మంగళవారం సంబంధిత అధికారులతో ఎస్పీ సమీక్షించారు. జులైలో మొత్తం 2,306 కాల్స్ అందాయని, ప్రతి రోజూ సగటును 73 కాల్స్ వచ్చినట్లు వివరించారు. వీటిలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు వెంటనే సహాయచర్యలు అందించినట్లు తెలిపారు.
ఓడీసీ, కణేకల్లు, పట్నం, శెట్టూరు ప్రాంతాల్లో బెల్టు దుకాణాలపై దాడులు చేసి కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. వజ్రకరూరు, శెట్టూరు, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో నాటుసారా విక్రేతలను పట్టుకొని బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఆపదలో ఉన్న ప్రజలతో పాటు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లైతే డయల్ 100, 99898 19191 నంబర్లను ఆశ్రయిస్తే వంద శాతం న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా ప్రజలకు భరోసా ఇచ్చారు.
బాధితులకు సత్వర న్యాయమే లక్ష్యం
Published Tue, Aug 1 2017 9:55 PM | Last Updated on Mon, Sep 11 2017 11:01 PM
Advertisement
Advertisement