అనంతపురం సెంట్రల్: మహిళలపై జరుగుతున్న నేరాలను ని యంత్రించాలని జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ పిలుపునిచ్చారు. మహిళల రక్షణ, భద్రత కోసం త్వరలో మహిళా రక్షక్ బృందాలను రంగంలోకి దింపుతున్నట్లు ప్రకటించారు. ఆదివారం పోలీసు కాన్ఫరెన్స్‌హాల్లో మహిళా రక్షక్ బృందాల అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ప్రతిరోజూ జరిగే నేరాల్లో 20 శాతం మహిళలకు సంబంధించవిగా నమోదవుతున్నాయని తెలిపారు. వీటికి తోడు ఈవ్‌టీజింగ్, వేధింపులు ఇతర కారణాలపై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వేధింపులకు పాల్పడుతున్న వారి ఆగడాలను అరికట్టేందుకు మహిళా రక్షక్ బృందాలు పనిచేస్తాయన్నారు.
జిల్లా వ్యాప్తంగా 12 మహిళా రక్షక్ బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయన్నారు. అనంతపురం, ధర్మవరం, కళ్యాణదుర్గం, తాడిపత్రి సబ్ డివిజన్‌లలో రెండు చొప్పున, గుంతకల్లు, కదిరి, పెనుకొండ, పుట్టపర్తి సబ్‌డివిజన్‌లో ఒక్కో బృందం పనిచేస్తుందన్నారు. పార్కులు, కళాశాలలు, పాఠశాలలు, దేవాలయాలు, బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో మహిళా రక్షక్ బృందాలు నిఘా ఉంచుతాయన్నారు. ఈవ్‌టీచర్లు, అమ్మాయిలను వేధించే ఆకతాయిలను గుర్తించి వారిని కౌన్సిలింగ్ కేంద్రాలకు తీసుకెళ్తారని తెలిపారు. అనుభవజ్ఞులైన వారితో కౌన్సిలింగ్ ఇప్పించడంతో పాటు వారి తల్లిదండ్రులను కూడా పిలిపించడం జరుగుతుందన్నారు. రెండోసారి పునరావృతం అయితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment