నూతనకల్
అదుపుతప్పి ఆటో బోల్తా పడడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండల కేంద్రంలోని మర్రి సత్యనారాయణరెడ్డి మినీ స్టేడియం వద్ద బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గోరెంట్ల గ్రామానికి చెందిన జటంగి సోమక్క, తుంగతుర్తి మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన పెద్దింటి నర్సమ్మ, గుండాల సంధ్యలు యడవెల్లి గ్రామంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై స్వగ్రామాలకు వెళ్లడానికి మండల కేంద్రంలో సూర్యాపేట నుంచి వరంగల్ జిల్లా దంతాలపల్లి వైపు వెళ్తున్న ఆటో ఎక్కారు. మినీ స్టేడియం సమీపంలోకి ఆటో రాగా రోడ్డుపైకి అకస్మాత్తుగా కుక్క రావడంతో అదుపు తప్పి రోడ్డుపక్కన పడడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఆటో బోల్తా.. ముగ్గురికి తీవ్రగాయాలు
Published Wed, Aug 24 2016 10:52 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement