రాష్ట్రంలో మూడు ట్రెక్కింగ్ కార్యక్రమాలు
Published Mon, Sep 12 2016 6:31 PM | Last Updated on Wed, Sep 18 2019 3:26 PM
తాడేపల్లిగూడెం (తాలూకాఆఫీస్ సెంటర్) : యువత కోసం మూడు ట్రెక్కింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు కారుమూరి సూర్యనారాయణ వెల్లడించారు. సోమవారం స్థానిక ప్రథమ్ కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువతలో సహస క్రీడలు, పర్యాటక ప్రదేశాల సందర్శనపై ఆసక్తి కలిగించేందుకు యూత్ హాస్టల్స్ అసోసియేషన్ కృషి చేస్తుందన్నారు.
2016–17లో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ట్రెక్కింగ్ నిర్వహించనున్నట్టు చెప్పారు. చిత్తూరు జిల్లా యుద్ధగళ తీర్ధం ట్రెక్కింగ్ కార్యక్రమం డిసెంబర్ 8న ప్రారంభమై 5 రోజులు కొనసాగుతుందని, అరకులోయ ట్రెక్కింగ్ డిసెంబర్ 23న ప్రారంభమై 6 రోజులు, చిత్తూరు జిల్లా శేషాచలం ట్రెక్కింగ్ 2017 జనవరి 25 నుంచి ప్రారంభమై 4 రోజులు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలచిన వారు 99852 04518 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని, వైహెచ్‌ఏఐడాట్‌ఓఆర్‌జి వెబ్‌సైట్‌లో వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు. తాడేపల్లిగూడెంలో యూత్ హాస్టల్స్ అసోసియేషన్ శాఖను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
Advertisement
Advertisement