ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభం
ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభం
Published Thu, Oct 27 2016 11:36 PM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM
తాడేపల్లిగూడెం : జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్, కోటగిరి విద్యాధరరావు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఫుట్‌బాల్ పోటీలు గురువారం స్థానిక డాక్టర్ తేతలి సత్యనారాయణ మూర్తి జెడ్పీ హైస్కూల్‌లో ప్రారంభమయ్యాయి. బాలుర జట్టులో సెమీ ఫైనల్స్‌కు పల్లంట్ల, పంగిడిగూడెం, కొయ్యలగూడెం, దేవరపల్లి జట్లు చేరుకున్నాయి. బాలికల జట్టులో సెమీ ఫైనల్స్‌కు జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, చిట్యాల, పల్లంట్ల జట్లు చేరాయి. శుక్ర,శని వారాలు సీనియర్ విభాగంలో పోటీలు జరగనున్నాయి.
Advertisement
Advertisement