తంగడపల్లిలో పట్టపగలే చోరీ | In thangadavally day time theft | Sakshi
Sakshi News home page

తంగడపల్లిలో పట్టపగలే చోరీ

Published Tue, Aug 9 2016 11:27 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

తంగడపల్లిలో పట్టపగలే చోరీ

తంగడపల్లిలో పట్టపగలే చోరీ

చౌటుప్పల్‌: మండలంలోని తంగడపల్లి గ్రామంలో మంగళవారం పట్టపగలే చోరీ జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సిలివేరు శంకరయ్య, అతడి భార్య అండాలు కుండలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం ఉదయం 10గంటలకు ఇంటికి తాళం వేసి కుండలు తయారు చేసేందుకు పాత ఇల్లు వద్దకు వెళ్లారు. సాయంత్రం వరకు కుండలు తయారు చేసి, ఇంటికి తిరిగి వచ్చారు. వచ్చేసరికి తాళం విరగ్గొట్టి, తలుపులు తీసి ఉన్నాయి. లోనికి వెళ్లి చూడగా, ఇళ్లంతా చిందరవందరగా ఉంది. దొంగలు బీరువాను తెరిచి, అందులోని 9తులాల బంగారు, 40తులాల వెండి ఆభరణాలను, రూ.10వేల నగదును ఎత్తుకెళ్లారు. బాధితులు శంకరయ్య పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, వారు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement