‘ఇన్‌కమ్ డిక్లరేషన్ స్కీం’ను సద్వినియోగం చేసుకోవాలి
Published Thu, Jul 28 2016 1:01 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM
వరంగల్ సిటీ : జిల్లాలోని వ్యాపార, పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు, డాక్టర్లు ఇన్‌కమ్ డిక్లరేషన్ స్కీమ్–2016ను సద్వినియోగం చేసుకోవాలని ఐఆర్‌ఎస్ ఆదాయపన్ను శాఖ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్లు సూచించారు. వరంగల్‌లోని చాంబర్ ఆఫ్ కామ ర్స్ కార్యాలయంలో బుదవారం ఈ స్కీంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నల్లధనం, పన్ను చెల్లించని ఆస్తుల వివరాలు సరైన విధంగా తెలియజేయకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇంకా పన్ను చెల్లించాల్సిన వారు ఈ స్కీంను వినియోగించుకుని లబ్ధి పొందాలని సూచించారు. సెప్టెంబర్ 30 లోపు ప్రత్యేక ఫామ్ ద్వారా గతంలో చెల్లించని ఆస్తులకు సైతం మూడు వాయిదాలల్లో వచ్చే ఏడాది మార్చి 31 వరకు చెల్లించవచ్చని వివరించారు. రిటర్న్‌్సను చెల్లించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపా రు. గతంలో తెలియజేసిన ఆస్తులకు కూడా ప్రస్తు తం ట్యాక్స్ చెల్లించే సదుపాయం ఉందన్నారు. సదస్సులో ఐఆర్‌ఎస్ అసిస్టెంట్ కమిషనర్ ఎంఎస్.రావు, రీజినల్ చార్టెడ్ కౌన్సిల్ ప్రతినిదులు రాజేం ద్రకుమార్, ఉపేందర్‌రావు, తెలంగాణ కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, చాంబర్ ప్రతినిదులు దుగ్యాల గోపాల్‌రావు, కంది ర వీందర్‌రెడ్డి, నాగమళ్ల పూర్ణచందర్, కట్కూరి సత్యనారాయణ, నాగభూషణం, చింతలపెల్లి వీరారావు, రాజయ్యయాదవ్, శ్రీరాం బిక్షపతి, అల్లె సంపత్, రాయిశెట్టి సత్యనారాయణ, కంచె సంప త్, బండి జనార్ధన్, రాజేష్‌కరాణి, శెట్టి కిషన్, హరి బాబు, తూము అశోక్ పాల్గొన్నారు.
Advertisement