విశాఖ: విశాఖ జిల్లా పాడేరులో ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల ఆందోళన రోజురోజుకీ ఉధృతమవుతోంది. వారం రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నా ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ తమను పట్టించుకోకపోవడంపై నిరసిస్తూ వారు ఆందోళన బట్టారు. ఈ నెల 27 నుంచి ఆమరణ దీక్ష చేస్తామని ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు స్పష్టం చేశారు.