
సంగారెడ్డిలో వేడుకలు
జిల్లాలో సోమవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజకీయ పార్టీలు, ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు జాతీయ జెండాను ఎగురవేశాయి.
సిద్దిపేట జోన్: జిల్లాలో సోమవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజకీయ పార్టీలు, ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు జాతీయ జెండాను ఎగురవేశాయి. సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఆర్టీఓ ఏసురత్నం, న్యాయమూర్తులు, విద్యుత్ డీఈ శ్రీనివాస్‌రెడ్డి. డాక్టర్ శివానందం జెండాలను ఎగురవేశారు.
మంత్రి హరీశ్‌రావు ఇంటి వద్ద టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు నయ్యర్ పటేల్ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో మున్సిపల్ రాజనర్సు, కౌన్సిలర్లు బర్ల మల్లికార్జున్, వెంకట్‌గౌడ్, అక్తర్ పటేల్, తాళ్లపల్లి సత్యానారాయణ, శేషుకుమార్, రాంచందర్‌రావు, మంత్రి ఓఎస్డీ బాల్‌రాజు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గంప మహేందర్‌రావు జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు సికిందర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌వర్మ జెండాను ఆవిష్కరించారు. బీజేపీ కార్యాలయం వద్ద ఆ పార్టీజిల్లా మాజీ అధ్యక్షుడు వంగ రాంచంద్రారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి జెండా ఆవిష్కరించారు, పట్టణంలోని బీసీ స్టడీ సర్కిల్ వద్ద డైరెక్టర్ రాములు జెండా ఎగురవేశారు.శివాజీ నగర్‌లో, పట్టణంలో పలు చోట్ల వైఎస్సార్ సీపీ జగన్ సేన నాయకులు విజయ్, రాజలింగం, రఘు, మధు, తిరుపతి జెండా ఆవిష్కరణ చేశారు.
లోక్‌సత్తా పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు రాజు పాల్గొన్నారు. సిద్దిపేట ఫర్నిచర్ అసోసియేషన్, ఎలియన్స్ క్లబ్, వాసవీ క్లబ్, పద్మశాలి చేనేత సంఘం ఆధ్వర్యంలో, భారత్ నగర్ షాప్, నీలకంఠ యూత్, వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేరువేరుగా జెండాలను ఎగురవేశారు.