-పరీక్ష రాసి మరణించిన విద్యార్థికి 443 మార్కులు
మెంటాడ: పరీక్ష రాసి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఓ విద్యార్థి 443 మార్కులు సాధించిన వైనమిది. విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఇద్దనవలస గ్రామానికి చెందిన కొరిపిల్లి దుర్గాప్రసాద్ ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. గ్రామానికి చెందిన బంగారునాయుడు, ఈశ్వరమ్మ పేద కుటుంబానికి చెందినప్పటికి కుమారుడికి పెద్ద చదువులు చదివించాలని భావించారు. ఆటో నడుపుతూ విశాఖపట్నం శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్‌లో చేర్పించారు.
ఫస్టియర్ పరీక్షలు రాసి గ్రామంలో జరుగుతున్న బంగారమ్మ పండగకు వచ్చాడు. మార్చి 23న ఇద్దనవలస నుంచి చల్లపేట గ్రామానికి స్నేహితులు సామిరెడ్డి గణేశ్, సామిరెడ్డి వెంకటేశ్‌తో కలిసి బైక్ పై వెళ్తుండగా ఇద్దనవలస సమీపంలో విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొనడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. మంగళవారం విడుదల చేసిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో కొరిపిల్లి దుర్గాప్రసాద్ 470కు 443 మార్కులు సాధించాడు.