intermediate result
-
ఒకప్పుడు చదువు మాన్పించాలని చూశారు..
నేడు సెకండ్ ఇంటర్ సీఈసీలో సఫియా స్టేట్ ఫస్ట్ హిందూపురం: ఆరు, తొమ్మిదో తరగతి చదువుతున్నపుడు ఆ అమ్మాయిని చదువు వద్దని చెప్పి ఇంట్లో వాళ్లు మాన్పించడానికి ప్రయత్నించారు. అయితే నేడు అదే అమ్మాయి ఇంటర్ సెకండియర్ సీఈసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచింది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వరూపరాణి చొరవతో మళ్లీ తనను చదివించారని, మొదటి ర్యాంకు సాధించినందుకు సంతోషంగా ఉందని ఆ విద్యార్థిని సంతోషం వ్యక్తం చేసింది. అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలోని మేళాపురానికి చెందిన ఖలీల్‌ఖాన్, జాహెదాల కూతురు సఫియా ఖానమ్ ఇంటర్ సెకండియర్ సీఈసీలో 970 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రథమ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలయేసు కళాశాలలో చదువుతున్న తాను మొదటి సంవత్సరంలో 487 మార్కులు సాధించి రాష్ట్రంలో మూడో ర్యాంకు సాధించానంది. ఇందుకు బాలయేసు కళాశాల ప్రిన్సిపాల్ బలరామిరెడ్డి, అధ్యాపకులతోపాటు ప్రధానోపాధ్యాయురాలు స్వరూపారాణిల ప్రోత్సాహమే కారణమని చెప్పింది. బాగా చదివి అధ్యాపకురాలినై తనలాంటి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దుతానని తెలిపింది. కళాశాల యాజమాన్యం విద్యార్థినికి మిఠాయిలు తినిపించి అభినందనలు తెలియజేశారు. -
చేతులు లేకున్నా..
రేగిడి : శ్రీకాకుళం జిల్లా రేగిడి మండల పరిధిలోని నాయిరాలవలస గ్రామానికి చెందిన కొవ్వాడ స్వప్న రెండు చేతులు లేకపోయినప్పటికీ చదువులో తన ప్రతిభను చాటుకుంటోంది. ద్వితీ య సంవత్సరం ఇంటర్మీడియెట్‌లో 725 మార్కులు ఎంపీసీ గ్రూపులో సాధించిం ది. ఈమె రాజాం ఉమెన్స్ కాలేజీలో విద్యనభ్యసిస్తోంది. నిరుపేద కుటుంబానికి చెందిన స్వప్నను వావిలవలస గ్రామానికి చెందిన సామాజిక వేత్త పాలూరి సిద్ధార్థ.. దాతల సహకారంతో చదివిస్తున్నారు. చదువుపై మమకారం ఉండడంతో ఇంటర్మీడియెట్‌లో మంచి మార్కులు సాధించడం పట్ల ఎంఈవో ప్రసాదరావుతోపాటు పాలూరి సిద్ధార్థ స్వప్నను అభినందించారు. -
చదువులో విజేత.. జీవితంలో పరాజిత!
-పరీక్ష రాసి మరణించిన విద్యార్థికి 443 మార్కులు మెంటాడ: పరీక్ష రాసి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఓ విద్యార్థి 443 మార్కులు సాధించిన వైనమిది. విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఇద్దనవలస గ్రామానికి చెందిన కొరిపిల్లి దుర్గాప్రసాద్ ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. గ్రామానికి చెందిన బంగారునాయుడు, ఈశ్వరమ్మ పేద కుటుంబానికి చెందినప్పటికి కుమారుడికి పెద్ద చదువులు చదివించాలని భావించారు. ఆటో నడుపుతూ విశాఖపట్నం శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్లో చేర్పించారు. ఫస్టియర్ పరీక్షలు రాసి గ్రామంలో జరుగుతున్న బంగారమ్మ పండగకు వచ్చాడు. మార్చి 23న ఇద్దనవలస నుంచి చల్లపేట గ్రామానికి స్నేహితులు సామిరెడ్డి గణేశ్, సామిరెడ్డి వెంకటేశ్‌తో కలిసి బైక్ పై వెళ్తుండగా ఇద్దనవలస సమీపంలో విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొనడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. మంగళవారం విడుదల చేసిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో కొరిపిల్లి దుర్గాప్రసాద్ 470కు 443 మార్కులు సాధించాడు. -
నేడు ఇంటర్ ద్వితీయ ఫలితాలు