బ్రెయిన్ స్ట్రోక్స్‌పై హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు | International Conference on Brain Strokes in Hyderabad | Sakshi
Sakshi News home page

బ్రెయిన్ స్ట్రోక్స్‌పై హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు

Published Fri, Nov 13 2015 12:36 AM | Last Updated on Sun, Sep 3 2017 12:23 PM

బ్రెయిన్ స్ట్రోక్స్‌పై హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు

బ్రెయిన్ స్ట్రోక్స్‌పై హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు

సాక్షి, హైదరాబాద్: ఈ నెల 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణలో పలువురు జనరల్ ఫిజీషియన్లు, న్యూరాలజిస్ట్‌లు, న్యూరో సర్జన్‌లతో స్ట్రోక్స్ (మెదడు, నరాలు) సంబంధిత వ్యాధులపై అవగాహన కోసం అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ఆసక్తి ఉన్న వైద్యులందరూ రావచ్చునని ఐఎస్‌సీడీఎస్ (ఇంటర్నేషనల్ స్ట్రోక్ అండ్ సెరెబ్రొవాస్క్యులర్ సింపోజియం) కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ నబీల్ ఎ హెరియల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లల్లో మెదడు సంబంధిత బాధితుల సంఖ్య ఏటికేటికీ గణనీయంగా పెరుగుతోందని, నిపుణులైన వైద్యులు దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఈ సదస్సుకు హాజరయ్యే వైద్యులు ఈ నెల 14న ఉదయం తమ పేరు నమోదుచేసుకుని పాల్గొనవచ్చునన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement