విశాఖపట్నం: విశాఖ సాగరతీరంలో నావికాదళ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ గురువారం సాయంత్రం పారంభమైంది. 'విక్టరీ ఎట్ సీ' స్థూపం వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరవీరులకు నివాళులర్పించారు. భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఆర్కే ధోవన్, తూర్పు నావికాదళాధిపతి వైస్ అడ్మిరల్ సంతోష్ సోని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రపంచ దేశాల నౌకాదళాలు... సముద్ర జలాల ద్వారా ఐక్యత అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో 52 దేశాల నౌకా దళాలు పాల్గొంటున్నాయి. భారతదేశం ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఉత్సవాలకు ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండవసారి.