విద్యార్థులకు పరిశోధనలే కీలకం
కానూరు (పెనమలూరు): విద్యార్థులు పరిశోధనల పై దృష్టి పెట్టాలని ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ కె.లక్ష్మీనారాయణ అన్నారు. కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం ఇస్రో ఆ«ధ్వర్యంలో జరిగిన ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నేడు పరిశోధనలకు చాలా ప్రాముఖ్యత ఉందని, ఉద్యోగ అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం పురోగమించాలంటే విద్యార్థులకు అవగహన కలిగే విధంగా ఇటువంటి ప్రదర్శనలు నిర్వహించాలని సూచించారు. ఇస్రో జనరల్ మేనేజర్ ఎంఎన్. సత్యనారాయణ మాట్లాడుతూ స్వదేశీ పరిజ్ఞానంతో అనేక ఉపగ్రహాలను ప్రయోగించామన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉపగ్రహాలకు రూపకల్పన చేసి దేశ ప్రజల అవసరాలకు ఉపయోగిస్తామని వివరించారు. కార్యక్రమ కోఆర్డినేటర్ జి.రమేష్‌బాబు, కాలేజీ కన్వీనర్ ఎం.రాజయ్య, ప్రిన్సిపాల్ ఎవి.రత్నప్రసాద్, ప్రొఫెసర్ పద్మజ పాల్గొన్నారు.