ఇతిహాసాలు భారతీయ సంస్కృతికి ప్రతీకలు
–జిల్లా తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు
గన్నమరాజు సాయిబాబ
కర్నూలు సీక్యాంప్: పురాణ ఇతిహాసాలే భారతీయ సంస్కృతికి ప్రతీకలని కర్నూలు జిల్లా తెలుగు రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు గన్నమరాజు సాయిబాబ అన్నారు. వీపూరి వెంకటేశ్వర్లు రచించిన పోతన భాగవతము పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం స్థానిక మద్దూర్‌నగర్‌లోని పింగళి సూరన తెలుగు తోటలో నిర్వహించారు. ఈ సందర్భంగా గన్నమరాజు సాయిబాబ మాట్లాడుతూ పోతన భాగవత పుస్తకంలో భక్తి మార్గం, దేశ సంస్కృతికి సంబంధించిన అంశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా తెలుగు రచయితల సంఘం సభ్యులు లక్ష్మయ్య, సుబ్బలక్ష్మి, రామారావు ప్రవీణ్, ఎలమర్తి రమణయ్య తదితరులు పాల్గొన్నారు.