రెపరెపలాడిన జనగామ జిల్లా జెండా | Janagama district flag on houses | Sakshi
Sakshi News home page

రెపరెపలాడిన జనగామ జిల్లా జెండా

Published Sun, Jul 24 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

Janagama district flag on houses

  • ఇంటింటికీ జెండా ఎగురవేసిన ప్రజలు
  • జనగామ : సకల జనులు మరోసారి తమ జిల్లా ఆకాంక్షను తెలిపారు. జేఏసీ పిలుపు మేరకు ఆదివారం ఇంటింటా జనగామ జిల్లా జెండాను ఎగురవేశారు. జనగామ జిల్లా కోరుతూ ఉద్యమాలు చేస్తున్న మండలాల పరిధిలో సకల జనులు ఇంటిపై జెండాను ఎగురవేసి ప్రభుత్వానికి బలమైన సంకేతాలు పంపించారు. అంతకుముందు చౌరస్తాలో జేఏసీ చైర్మన్‌ దశమంతరెడ్డి జిల్లా జెండాను ఎగురవేశారు. శాంతియుత ఉద్యమాలతో జనగామ జిల్లా సాధించుకుంటామని దశమంతరెడ్డి తెలిపారు. అక్రమ కేసులు, నిర్బంధాలు ఉద్యమాన్ని ఆపలేరన్నారు. వాడవాడలా జనం తమ గుండె నిండా జిల్లా ఆకాంక్షను ఇంటిపై జెండా రూపంలో చూపించారు.   

Advertisement

పోల్

Advertisement