టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక | join in ysrcp | Sakshi
Sakshi News home page

టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక

Published Mon, Dec 19 2016 12:14 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

join in ysrcp

బనగానపల్లె: మండల పరిధిలోని ఇల్లూరుకొత్తపేటకు చెందిన 50 కుటుంబాలవారు ఆదివారం టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరారు. వారంతా పార్టీ నియోజవకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహం వద్దకు వచ్చి ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు చీకాటి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో మిద్దె తిమ్మరాజు, కర్రెద్దుల శివారెడ్డి, టి.పుల్లయ్య, గంతినన్నె, పేరాయిపల్లెమాబు, చాంద్‌బాషా, తోకలకిట్టు, తోకల ఏసు, ఆకులప్రసాద్, తోకల నరసయ్య, బుజ్జితోపాటు 50 కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోనికి వచ్చి రెండున్నరసంవత్సరాలు పూర్తయినా సీఎం ఎన్నికల హామీలను కూడా అమలు చేయడం లేదన్నారు. ఈ కారణంగా ప్రజలకు ప్రభుత్వంపై విసుగు వచ్చిందన్నారు.  వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ ప్రజల కోసం నిర్విరామంగా చేస్తున్న పోరాటానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి సిద్దంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, నాయకులు వెంకటేశ్వర్లు, శంకర్‌రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement