సత్రం భూములపై చంద్రబాబు నోరు విప్పాలి | Dharmana demand on chandrababu | Sakshi
Sakshi News home page

సత్రం భూములపై చంద్రబాబు నోరు విప్పాలి

Published Wed, Jul 6 2016 2:47 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

సత్రం భూములపై చంద్రబాబు నోరు విప్పాలి - Sakshi

సత్రం భూములపై చంద్రబాబు నోరు విప్పాలి

వైఎస్సార్‌సీపీ నిజనిర్ధారణ కమిటీ కన్వీనర్ ధర్మాన డిమాండ్
 
 సాక్షి, హైదరాబాద్ : సదావర్తి సత్రం భూముల అమ్మకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకా మౌనంగా ఉండటానికి వీల్లేదని, ఆయన నోరు విప్పాలని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. సత్రం భూముల అమ్మకంలో చోటుచేసుకున్న అక్రమాలను నిగ్గుతేల్చేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక నిజనిర్ధారణ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలోని ఈ కమిటీ భూముల అమ్మకంపై లోతుగా అధ్యయనం చేసి, వైఎస్ జగన్‌కు సోమవారం నివేదికను సమర్పించింది. ఈ నేపథ్యంలో ధర్మాన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రాథమిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సదావర్తి సత్రం భూముల విక్రయంలో అడుగడుగునా నిబంధనలను ఉల్లంఘించారని చెప్పారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను, ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సైతం పక్కన పెట్టారని తెలిపారు.

 చంద్రబాబు ఆదేశాలతోనే...
 సదావర్తి సత్రం భూములను విక్రయించాలంటూ టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సీఎం బాబుకు రాసిన లేఖతో కథ ప్రారంభమైందని ధర్మాన పేర్కొన్నారు. ఆ లేఖ అంది న వెంటనే చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతోనే సత్రం భూములను అమ్మాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్ణయించినట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. బిజినెస్ రూల్స్ ప్రకారం.. భూముల అమ్మకంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని, గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లాలని అన్నారు. ఇందులో అదేమీ జరగలేదని, అందరినీ అంధకారంలో ఉంచి వ్యవహారం నడిపించారని ఆరోపించారు. హిందూ ధర్మ సంస్థల ఆస్తుల  పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. హిందువుల మనోభావాలను దారుణంగా దెబ్బ తీసిందని విమర్శించారు.  

 పేద బ్రాహ్మణులు లేరా?
 పేద బ్రాహ్మణుల విద్యకు ఉపయోగపడాల్సి సదావర్తి సత్రం భూములను ఎందుకు అమ్మేశారు? రాష్ట్రంలో పేద  బ్రాహ్మణులు లేరని ప్రభుత్వం భావిస్తోందా అని ధర్మాన ప్రశ్నిం చారు. హిందూ సంస్థల భూములను దొంగల పాలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. చెన్నై సమీపంలోని తాలంబూర్ వద్ద ఉన్న విలువైన సత్రం భూముల అమ్మకం జరుగుతున్నపుడు పరి శీలనకు రాష్ట్ర ఆర్థిక శాఖ, న్యాయ శాఖ అధికారులు వెళ్లాల్సి ఉండగా అలాంటిదేమీ జరగలేదన్నారు. భూముల అమ్మకానికి సంబంధించి 2005లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 424 జీవో ప్రకారం.. ఈ-టెండర్, బహిరంగ వేలం రెండూ నిర్వహించాలని చెప్పారు. సత్రం భూముల విషయంలో ప్రభుత్వం ఈ జీవోకే వ్యతిరేకంగా వ్యవహరించిందన్నారు.

ఈ-టెండర్ నిర్వహిస్తే అందరూ పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ పెద్దలు తమ కుమ్మక్కు వ్యవహారానికి ఇబ్బం ది లేకుండా బహిరంగ వేలం నిర్వహించారని దుయ్యబట్టారు. వేలంలో పాల్గొన్న 8 మంది వ్యక్తులు  బంధువులు, మిత్రులేనన్నారు. ఈ వేలాన్ని రద్దు చేసి, అక్రమాలపై విచారణ జరిపించాలని టీడీపీ మినహా ఇతర రాజకీయ పార్టీలన్నీ కోరుతూంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదని నిలదీశారు. ఈ వ్యవహారంపై సత్రం భూములను కొన్న కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి మాట్లాడడం సరికాదని, సీఎం చంద్రబాబు, ప్రభుత్వం స్పందించి తీరాలని ఆయన డిమాండ్ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement