టీఆర్‌ఎస్‌లో చేరిన కంబాలపల్లి కృష్ణ | Kambalapalli Krishna Join in TRS | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో చేరిన కంబాలపల్లి కృష్ణ

Published Mon, Nov 28 2016 1:39 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM

Kambalapalli Krishna Join in TRS

శాలిగౌరారం: మండలంలోని గురుజాల గ్రామానికి చెందిన బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి కంబాలపల్లి కృష్ణ బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆదివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ నేతృత్వంలో సూర్యాపేట జిల్లాలోని జాజిరెడ్డిగూడెం పర్యటనలో ఉన్న రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశర్‌రెడ్డిల సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ మేరకు సాయంత్రం ఇక్కడ ఆయన ఈ విషయాన్ని విలేకరులకు తెలిపారు.బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకునేందుకే టీఆర్‌ఎస్‌లో చేరినట్లు కృష్ణ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement