జర్నలిస్ట్, పోలీసు ప్రాధాన్యతను తెలిపే చిత్రం ‘కాపాళి’
– డైరెక్టర్ రాజేష్‌మేసా
కర్నూలు సీక్యాంప్:
సమాజంలో జర్నలిస్ట్‌లు, పోలీసుల ప్రాధాన్యతను తెలిపే చిత్రం ‘కాపాళి’ అని ఆ చిత్ర దర్శకుడు రాజేష్‌మేసా అన్నారు. గురువారం ఆయన నగరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనది కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అని.. చిన్ననాటి నుంచే సినిమాలపై ఉన్న మక్కువతో దర్శకుడిగా ఎదిగానని తెలిపారు. కాపాళి చిత్రం కర్నూలుకు చెందిన సినిమా అని జిల్లా వాసులు తిలకించాలని కోరారు. సమావేశంలో చిత్ర నిర్మాత అన్నమ్మ, నటీనటులు, టెక్నీషియన్లు పాల్గొన్నారు.