- కాపుల ప్రదర్శనల హోరు
వాడవాడలా కొవ్వొత్తులతో నిరసన
Published Mon, Jan 9 2017 11:44 PM | Last Updated on Mon, Jul 30 2018 6:21 PM
బోట్‌క్లబ్ (కాకినాడ) :
కాపుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు మూడేళ్లు గడుస్తున్నా రిజర్వేషన్ల విషయం పట్టించుకోవడం లేదని, కాపులు రోడ్డెక్కే çపరిస్థితి తీసుకొచ్చారని కాపు జేఏసీ నాయకులు ధ్వజమెత్తారు. కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ చేస్తున్న ఉద్యమంలో భాగంగా సోమవారం రాత్రి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాపు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఇచ్చిన హామీ నెరవేర్చే వరకూ ఈ ఉద్యమం ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పి గన్నవరంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పి.గన్నవరంలో మూడు రోడ్లు సెంటర్‌లో జరి గిన కొవ్వొత్తుల ర్యాలీ, సుమారు ఐదువేల మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున జరిగాయి. కాపు యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Advertisement