జిల్లా కాపు నేతలు రామకృష్ణ, తాతాజీ అరెస్టు
Published Tue, Nov 15 2016 11:43 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
రావులపాలెం :
ముద్రగడ పద్మనాభం కాపు సత్యాగ్రహ యాత్ర నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. రావులపాలెం మండలం గోపాలపురానికి చెందిన కాపు జేఏసీ నేత ఆకుల రామకృష్ణను మంగళవారం సాయంత్రం అకస్మాత్తుగా అరెస్టు చేసి పోలీస్‌స్టేష¯ŒSకు తరలించారు. ముద్రగడ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆకుల యాత్రకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. అయితే సాయంత్రానికి ఆయనను, మండల కాపు సంఘం అధ్యక్షుడు సాధనాల శ్రీనివాసును పోలీసులు అరెస్టు చేసి స్టేష¯ŒSకు తరలించారు. కొంత సేపు అక్కడ ఉంచిన అనంతరం వారిని పోలీస్ వాహనంలో వారిని తరలించారు. ఎక్కడకి తరలిస్తున్నారన్నదానిపై పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. అయితే కాకినాడ తరలించినట్టు తెలిసింది.
అమలాపురం టౌ¯ŒS : కోనసీమ బలిజ తెలగ కాపు (టీబీకే) అధ్యక్షుడు కల్వకొలను తాతాజీని అమలాపురం పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఆయనను అదుపులోకి తీసుకుని పట్టణ పోలీసు స్టేష¯ŒSలో ఉంచారు. ఒక దశలో తాతాజీని అమలాపురం స్టేష ¯ŒS నుంచి కాకినాడకు తరలిం చేం దుకు పోలీసులు ప్రయత్నించగా కాపు యువకులు స్టేష¯ŒSకు చేరుకుని అడ్డుకున్నారు. అక్రమ అరెస్టును నిరసిస్తూ స్టేష¯ŒS ఎదుట ధర్నా చేశారు. పట్టణానికి చెందిన కాపు రిజర్వేష¯ŒS పోరాట సమితి నాయకులు నల్లా విష్ణుమూర్తి, ఆయన కుమారుడు నల్లా పవ¯ŒSకుమార్ కోసం పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ రాత్రి తొమ్మిది గంటల వరకూ ప్రత్యేక పోలీసు బృందాలతో గాలిస్తూనే ఉన్నారు. ముద్రగడ పాదయాత్రకు చిత్తూరు, ప్రకాశం, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు ఘట్టమనేని శ్రీనివాస్, తివిక్రమవర్మ, విజయకుమార్, బ్రహ్మారెడ్డి రావులపాలెం, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు ప్రాంతాల్లో పోలీ సు అధికారులతో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ సమీక్షలు జరుపుతూనే ఉన్నారు. ముద్రగడతో సహ పలువురు కీలక కాపు నేతలు హౌస్ అరెస్ట్‌లతో ఎదురవుతున్న పరిణామాలను ఎస్పీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ప్రజా ఆగ్రహానికి గురైతే పతనం తప్పదు
కిర్లంపూడి : ప్రజా ఆగ్రహానికి గురైతే ఏ ప్రభుత్వానికైనా పతనం తప్పదని కాపు జేఏసీ నాయకులు అన్నారు. మంగళవారం సాయంత్రం కాపు ఉద్యమనేత ముద్రగడ స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, అద్దేపల్లి శ్రీధర్‌తో పాటు పలువురు నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కాపులకు ఇచ్చిన హామీల సాధన కోసం మాజీ ఎంపీ, కాపు ఉధ్యమనేత ముద్రగడ పద్మనాభం గాంధేయ మార్గంలో నిర్వహించ తలపెట్టిన కాపు సత్యాగ్రహ యాత్రను అడ్డుకోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం పౌరహక్కులను కాలరాసి ఎమెర్జెన్సీని తలపిస్తుందన్నారు. కాపు సత్యాగ్రహ యాత్ర వలన ముద్రగడకు ఎనలేని ప్రజా స్పందన వస్తుందనే ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులతో అడ్డుకున్నారని ఆరోపించారు. జీవీ రమణ, సంగిశెట్టి అశోక్, తుమ్మలపల్లి రమేష్, గణేశుల రాంబాబు, తోట బాబు, మలకల చంటిబాబు, గౌతు స్వామి తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement