వాగులో పడి మూడేళ్ల బాలుడు మృతి | kid dead | Sakshi
Sakshi News home page

వాగులో పడి మూడేళ్ల బాలుడు మృతి

Sep 11 2016 10:06 PM | Updated on Aug 28 2018 7:09 PM

వాగులో పడి మూడేళ్ల బాలుడు మృతి - Sakshi

వాగులో పడి మూడేళ్ల బాలుడు మృతి

బాపులపాడు మండలం రంగన్నగూడెంలోని వెట్టివాగులో పడి మూడేళ్లు బాలుడు దుర్మరణం చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పొలుకొండ హేమంత్‌ (3) సాయంత్రం సమయంలో ఆడుకుంటూ ఇంటికి దగ్గరలోని వెట్టివాగు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తూ వాగులో పడిపోయాడు. పొలవరం కుడిప్రధానకాలువ నుంచి గోదావరి నీళ్లను వెట్టివాగు ద్వారా వీరవల్లి చెరువుకు తరలిస్తుండటంతో వాగులో నీటి ఉధృతి ఎక్కువగా ఉంది.

రంగన్నగూడెం (హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌): 
బాపులపాడు మండలం రంగన్నగూడెంలోని వెట్టివాగులో పడి మూడేళ్లు బాలుడు దుర్మరణం చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పొలుకొండ హేమంత్‌ (3) సాయంత్రం సమయంలో ఆడుకుంటూ ఇంటికి దగ్గరలోని వెట్టివాగు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తూ వాగులో పడిపోయాడు. పొలవరం కుడిప్రధానకాలువ నుంచి గోదావరి నీళ్లను వెట్టివాగు ద్వారా వీరవల్లి చెరువుకు తరలిస్తుండటంతో వాగులో నీటి ఉధృతి ఎక్కువగా ఉంది. వెట్టివాగులో పడిన బాలుడు హేమంత్‌ నీటి ప్రవాహానికి కొద్దిదూరం కొట్టుకుపోవటంతో స్థానికులు చూసి రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు బాలుడి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. హేమంత్‌ మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాంబాబు  గుండెలవిసేలా ఏడ్చారు. అప్పటివరకు కళ్ల ముందు నవ్వుతూ ఆటలాడుకున్న కొడుకు క్షణాల్లో విగతజీవిగా మారటం ఆ తల్లిదండ్రులకు తీవ్రశోకాన్ని మిగిల్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement