పర్యాటక రంగంగా తీర్చిదిద్దాలని విన్నపం
మొలంగూర్ దూద్‌బావి నీటికి ప్రాముఖ్యత
శంకరపట్నం: మండలంలోని మొలంగూర్ ఖిల్లా చారిత్రక కట్టడాలకు నిలయంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. అలిగిరి మహరాజ్ అనే అనే సంస్థానదీశుడు మొలంగూర్ గుట్టను ఖిల్లాగా చేసి ఇక్కడి నుండి ఓరుగల్లును పరిపాలించేవాడని స్థానికులు చెప్తారు. చత్రుదుర్భేద్యమైన కోటను నిర్మించి ఇక్కడి నుంచి గుట్టపైకి అశ్వాలపై వెళ్లేందుకు రాతిబాటను నిర్మించారు. మొలంగూర్ గ్రామంలో కోటను నిర్మించి , కోనేరు తవ్వించారు. ఈ కోటలోనే అశ్వాలు సేదతీరేవని ప్రచారం ఉంది. మొలంగూర్ గ్రామం కోటలు, ఖిల్లా ముఖద్వారంతో పాటు, గుట్టపై కోనేరు నిర్మితం కావడం విశేషం. ఖిల్లా ముఖం ద్వారం నుండి ముందుకు వెళగానే దూద్‌బావి దర్శనమిస్తుంది. ఈ దూద్‌బావి నీటిని నాటి రాజులు హైదరాబాద్‌కు గుర్రం బండిపై తీసుకెళ్లేవారని ప్రచారంలో ఉంది. మొలంగూర్ ఖిల్లా అందాలను చూడడానికి కరీంనగర్ జిల్లాతో పాటు వరంగల్ జిల్లానుంచి పర్యాటకులు వస్తున్నప్పటికీ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోలేదు. రెండేళ్ల క్రితం మొలంగూర్ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా చేయాలని అధికారులు నివేదించారు. పలు మార్లు ప్రజలు, ప్రజాప్రతినిదులు వినతులు ఇస్తున్నారు.
విద్యార్థుల సందడి..
మొలంగూర్ ఖిల్లా వైభవాన్ని తెలుసుకునేందుకు విద్యార్థులను ఈ ప్రాంతానికి తీసుకొస్తారు. మొలంగూర్ ఖిల్లాపైకి చేరుకొని నాటి కళావైభవాన్ని స్థానికులను అడిగి తెలుసుకుంటారు. కరీంనగర్,వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌పాఠశాల విద్యార్థులు ఇక్కడి విశేషాలను తెలుసుకోవడానికి వస్తారు.
చారిత్రక కట్టడం మొలంగూర్ ఖిల్లా
Published Wed, Jan 25 2017 9:46 PM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM
Advertisement