మండలంలోని పీఎన్ కాలువ గ్రామపంచాయతీకి చెందిన సాధు వెంకటరామిరెడ్డి కుమారుడు సాధు భరత్‌కుమార్‌రెడ్డి (28) బెంగళూరులో రైలు ఢీకొని మృతి చెందాడు.
సుండుపల్లి:
మండలంలోని పీఎన్ కాలువ గ్రామపంచాయతీకి చెందిన సాధు వెంకటరామిరెడ్డి కుమారుడు సాధు భరత్‌కుమార్‌రెడ్డి (28) బెంగళూరులో రైలు ఢీకొని మృతి చెందాడు. భరత్‌కుమార్‌రెడ్డి జీవనోపాధి కోసం బెంగళూరులో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ట్రైన్‌హాలీ రైల్వేస్టేషన్‌లో పట్టాలు దాటుతుండగా రైలు వచ్చి ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని తండ్రి వెంకటరామిరెడ్డి పేరుమీద ఉన్న డెబిట్‌కార్డు ఆధారంగా బెంగళూరు పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం అందజేశారు. వీరి ద్వారా విషయం తెలుసుకున్న భరత్‌కుమార్‌రెడ్డి కుటుంబ సభ్యులు బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు.