![గుల్జార్‌హౌజ్‌లో గిరాకీ లేక వెలవెలబోతున్న పతంగుల దుకాణం](/styles/webp/s3/article_images/2017/09/4/61482598164_625x300.jpg.webp?itok=CAij_fcb)
గుల్జార్‌హౌజ్‌లో గిరాకీ లేక వెలవెలబోతున్న పతంగుల దుకాణం
చార్మినార్: పెద్ద నోట్ల రద్దుతో పాటు చిల్లర సమస్యలు తలెత్తడంతో పాతబస్తీలో పతంగుల వ్యాపారం కుంటుపడింది. ప్రతి ఏటా డిసెంబర్–జనవరి సీజన్ లో పాతబస్తీలో పతంగుల కొనుగోళ్లు జోరుగా సాగుతాయి. కానీ ఈసారి పెద్ద నోట్ల రద్దు, చిల్లర సమస్య కారణంగా కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. పాతబస్తీలోని గుల్జార్‌హౌజ్‌లో ఏటా దాదాపు ఐదు వేల దుకాణాల్లో పతంగుల సామాగ్రిని విక్రయిస్తారు. రోజూ లక్షల్లో వ్యాపారం జరుగుతుంటుంది. తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, కర్నూలు తదితర ప్రాంతాల నుంచి రిటైల్ వ్యాపారులు కూడా ఇక్కడికి వస్తారు. కానీ ఈసారి ఆ సందడే కన్పించడం లేదు. మరోవైపు చైనా మాంజను నిషేధించడం కూడా కొనుగోళ్లపై ప్రభావం చూపుతోంది.