కొండాపురం: కొండాపురంలో స్వైన్‌ఫ్లూ కలకలం సృష్టించింది. ఇక్కడి సీఎంఆర్ కాలనీలో నివాసం ఉంటున్న వి.ప్రతాప్‌రెడ్డి ఈనెల 8న తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చేరారు. ఆయనకు స్వైన్‌ఫ్లూ సోకినట్లు నిర్ధరణ కావడంతో కడపనుంచి ప్రత్యేక వైద్యబృందం కొండాపురం వెళ్లింది. ప్రతాప్‌రెడ్డి కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించింది. అనంతరం బృందంలోని సభ్యులు విలేకరులతో మాట్లాడుతూ తరచూ దగ్గు,జ్వరం వస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెప్పారు. ముఖానికి తప్పకుండా మాస్క్ ధరించాలన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు.వైద్యులు ఖాజామొహిద్దీన్, వెంకట్‌రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.