సత్తా చాటిన కృష్ణాజిల్లా జట్టు | krishna team win game | Sakshi
Sakshi News home page

సత్తా చాటిన కృష్ణాజిల్లా జట్టు

Published Wed, Aug 10 2016 12:07 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

krishna team win game

వెంకటగిరి : పట్టణంలోని తారకరామ క్రీడాప్రాంగణంలో జరుగుతున్న అండర్‌ –19 అంతర జిల్లాల ప్లేట్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో భాగంగా మంగళవారం గుంటూరు – కృష్ణాజిల్లా జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. తొలిరోజు ఆటలో కృష్ణాజట్టు సత్తాచాటిందవి. తొలుత గుంటూరు జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. 29.1 ఓవర్లు ఆడి 78 పరుగులు చేసి ఆలౌటైంది. కృష్ణా జట్టు బౌలింగ్‌లో కౌశిక్‌ 5, ప్రమోద్‌ 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాంటింగ్‌కు దిగిన కృష్ణా జట్టు ఆట ముగిసే సమయానికి 54.5 ఓవర్లుకు 6 వికెట్లు నష్టానికి 305 పరుగులు చేసింది. చైతన్య 151, కౌశిక్‌ 50 పరుగులు చే శారు. కాగా బుధవారం ఆట కొనసాగనుంది.
 మరో మ్యాచ్‌లో.. 
వైఎస్సార్‌ కడప – పశ్చిమగోదావరి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పశ్చిమగోదావరి జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. 63 ఓవర్లలో 177 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వైఎస్సార్‌ కడప జట్టు ఆటముగిసే సమయానికి 27 ఓవర్లలో 3 వికెట్లు నష్టానికి 90 పరుగులు చేసింది. బుధవారం ఆట కొనసాగించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement