ఆదిత్య ఆధ్వర్యంలో ‘లక్ష్య ఇంటర్నేషనల్‌ స్కూల్‌’ | lakshya international school | Sakshi
Sakshi News home page

ఆదిత్య ఆధ్వర్యంలో ‘లక్ష్య ఇంటర్నేషనల్‌ స్కూల్‌’

Nov 4 2016 10:40 PM | Updated on Sep 4 2017 7:11 PM

విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించాలని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఉండూరు గ్రామ పరిధిలో ఏడీబీ రోడ్డులో ఆదిత్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ‘లక్ష్య ఇంటర్నేష¯ŒS స్కూల్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అంతకు ముందు పాఠశాల ఆవరణలో వల్లభాయ పటేల్‌ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

ఉండూరు (సామర్లకోట) :
విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించాలని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఉండూరు గ్రామ పరిధిలో ఏడీబీ రోడ్డులో ఆదిత్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ‘లక్ష్య ఇంటర్నేష¯ŒS స్కూల్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అంతకు ముందు పాఠశాల ఆవరణలో వల్లభాయ పటేల్‌ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. 
ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి జాతీయ నాయకుని గురించి తెలుసుకొని వారిలో ఉన్న మంచిని గ్రహించాలని సూచించారు. దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక స్పృహలకు సంబందించిన అంశాల పై ఉపాధ్యాయులు బోధనలు చేయాలన్నారు. విద్యతో పాటు ఆట పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలపై శ్రద్ధ చూపాలన్నారు. పోటీ ప్రపంచంలో ఇంగ్లీషును ఉపాధి కోసమే సద్వినియోగం చేసుకొని మాతృభాషను మరువకూడదన్నారు.  భారతదేశంలో ఉన్న సంస్కృతి, సంప్ర దాయాలు ఇతర దేశాలకు చెందిన వారు ఎంతో గౌరవిస్తున్నారని తెలిపారు. కన్నతల్లి, జన్మభూమి, మాతృ భాష, మాతృదేశాన్ని మరచి పోకూడదని సూచించారు. మతం వ్యక్తిగతమైనదని, అయితే కొందరు కుల, మతాలతో రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఆదిత్య శేషారెడ్డి ఉపాధ్యాయునిగా విద్యా సంస్థలు స్థాపించి అనేక మందికి ఉపాధి కల్పించారన్నారు. ఆయనతో పాటు కుమారులు, కోడళ్లు, భార్య విద్యా సంస్థలకు అంకితం కావడం విశేషమని పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో విద్యను అందించాలని సూచించారు. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు, ప్రైవేటు రంగ సంస్థలు ప్రగతి సాధించిన్నప్పుడే అభివృద్ది సాధ్యపడుతుందన్నారు.
 సభకు అధ్యక్షత వహించిన ఆదిత్య విద్యా సంస్థల చైర్మ¯ŒS ఎ¯ŒS.శేషారెడ్డి మాట్లాడుతూ 1984లో విద్యారంగంలో ప్రవేశించి ఇప్పటి వరకు వివిధ రకాల 50 విద్యా సంస్థలను ఏర్పాటు చేశామని, ఐదు వేల మంది ఫ్యాకల్టీలు, 50 వేల మంది విద్యార్ధులు ఉన్నారని తెలిపారు. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ ఆదిత్య విద్యా సంస్థలో క్రమ శిక్షణతో కూడిన విద్యను అందించడం వలనే అనేక మందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయన్నారు. ఇటీవల నిర్వహించిన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీలు మురళీమోహన్, రవీంద్రబాబు, కె.హరిబాబు, తోట నరసింహంలతో పాటు సతీష్‌రెడ్డి,  దినేష్‌రెడ్డి, సుగుణ, సృతికిరణ్, లక్ష్మిరాజ్యం తదితరులు పాల్గొన్నారు. వెంకయ్య నాయుడిని శేషారెడ్డి కుటుంబసభ్యులు ఘనంగా సన్మానించారు.
 
  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement