రూ. 100 కోట్ల విలువైన భూ కబ్జా | land mafiya | Sakshi
Sakshi News home page

రూ. 100 కోట్ల విలువైన భూ కబ్జా

Published Sat, Dec 10 2016 11:18 PM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM

రూ. 100 కోట్ల విలువైన భూ కబ్జా

రూ. 100 కోట్ల విలువైన భూ కబ్జా

  •  దిబ్బపై వాలుతున్న భూ రాబందులు
  • అరవై ఏళ్లుగా జీవనం సాగిస్తున్న పేదలపై దౌర్జన్యం
  • నకిలీ డాక్యుమెంట్లతో కొంగొత్త వేషాలు
  •  ఇళ్లు ఖాళీ చేయిస్తున్న కబ్జాదారులు 8 లబోదిబోమంటున్న బాధితులు
  • రాజమహేంద్రవరంలోని ఆదెమ్మ దిబ్బపై భూ రాబందులు వాలాయి. దాదాపు రూ.100 కోట్ల విలువైన 3.54 ఎకరాల భూమికి  నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జాకు తెరదీస్తున్నారు. ఆ స్థలంలో గుడిసెలు వేసుకుని అరవై ఏళ్లుగా నివాసముంటున్న పేదలను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. అక్కడ నాయకులుగా చెలామణి అవుతున్న వ్యక్తులను గుప్పెట్లో పెట్టుకుని ఈ దందాను సాగిస్తున్నారు. పేదలను నోరెత్తనీయకుండా చేస్తున్నారు.  నగర నడిబొడ్డున గత ఇరవై రోజులుగా ఈ తంతు నడిపిస్తున్న కబ్జాదారులు ఈ వ్యవహారాన్ని అధికారుల దృష్టికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కంబాల చెరువుకు 50 మీటర్ల దూరంలో పేపర్‌ మిల్లు రోడ్డుకు ఆనుకుని ఉన్న ఈ భూమిలో పాగా వేసేందుకు పక్కా వ్యూహం రచించి పావులు కదుపుతున్నారు. 110 మంది పేదలను నిరాశ్రయులను చేస్తున్నారు.
     
    సాక్షి, రాజమహేంద్రవరం :
    రాజమహేంద్రవరం నగర నడిబొడ్డులో 36, 38 డివిజన్ల మధ్య ఆదెమ్మ దిబ్బ ప్రాంతం ఉంది. భూములు ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రాంతం చాలా విలువైనదిగా మారింది. అంతేకాకుండా కంబాల చెరువు నుంచి పేపర్‌మిల్లుకు వెళ్లే ప్రధాన రహదారి, వెనుక స్వతంత్ర ఆస్పత్రి, మరో పక్క వాంబే గృహాలున్నాయి. స్వాతంత్య్రానికి పూర్యం ఇక్కడ వ్యవసాయం జరిగేదని అక్కడి వారు చెబతున్నారు. తదనంతరకాలంలో మురుగునీటి చెరువుగా మారిపోంది.60 ఏళ్ల కిందట రాజమహేంద్రవరంలోని పేదలు ఈ చెరువును పూడ్చుకుంటూ చిన్న చిన్న ఇళ్లు నిర్మించుకుని నివాసముంటున్నారు. మరి కొందరు పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు. తాత,ముత్తాతల నుంచి ఇక్కడే జీవిస్తున్నారు. నాలుగు తరాల నుంచి ఇక్కడే బతుకుతున్నామని చెబుతున్నారు. ఇళ్లమధ్య నగరపాలక సంస్థ సిమెంటు రోడ్డు కూడా నిర్మించడమే కాకుండా విద్యుత్‌ సౌకర్యం కూడా కల్పించింది. సర్వే నంబర్‌ 170లోని 3.54 ఎకరాల భూమిలో 110 మంది పేదలు నివసిస్తున్నారు. సిమెంటు రోడ్డుకు ఓ వైపు 36వ వార్డు పరిధిలో 56 ఇళ్లు, మరోవైపు 38వ డివిజ¯ŒS పరిధిలో 54 ఇళ్లున్నాయి.
    ఈ భూమి ఎవరిది?
    ఈ భూమిపై పలువాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ఇక్కడ కరణంగా పనిచేసిన సత్యవోలు పాపారావు తన భూమిగా చెప్పకునేవారని ప్రచారం జరుగుతోంది. స్థానింకగా ఉంటున్నవారు తమదండ్రులు ఈ పొలంలో వ్యవసాయం చేసేవారని, పంటను పాపారావు, తాము చెరిసగం తీసుకునేవారమని పేర్కొంటున్నారు.  ఇవన్నీ ప్రభుత్వ భూములని, ఆయన కరణంగా పనిచేయడంతో చాలా భూములు ఆయనవనే డాక్యుమెంట్లు పుట్టుకొచ్చాయనే వాదన మరికొందరు వినిపిస్తున్నారు. ఆయన మృతి చెందిన తర్వాత దాదాపు 40 ఏళ్లుగా ‘ఈ స్థలం మాదని’ ఎవ్వరూ రాలేదని అక్కడి పేదలు చెబుతున్నారు.
    తనదేనంటూ...
    ఈ మధ్యకాలంలో కొలమూరుకు చెందిన ఓ వ్యక్తి వచ్చి ‘పాపారావు అన్న కుమారుడి వద్ద ఈ స్థలం కొన్నా’నంటూ స్థలం ఖాళీ చేయాలని పేదలను బెదిరిస్తున్నాడు. తాను ఈ స్థలం కొన్నానని, ఖాళీ చేయకపోతే ఇబ్బందులు పడతారని హెచ్చరించడమే కాకుండా తొలగించే పనిలో కబ్జాదారులున్నారు. పేదలను భయపెట్టి తమ మనుషులతో ఇళ్లు పీకేయిస్తున్నారు.. ఇప్పటికే 38వ డివిజ¯ŒS పరిధిలో ఉన్న 54 ఇళ్లను తొలగించారు. సోమవారంలోపు 36వ డివిజ¯ŒSలో ఉన్న 56 కుంటుంబాల వారు ఖాళీ చేయాలని లేకపోతే తానే పీకేయిస్తానని బెదిరిస్తున్నారని అక్కడి వారు వాపోతున్నారు.  ప్రస్తుతం మార్కెట్‌ విలువ ప్రకారం ఇక్కడ గజం స్థలం విలువ దాదాపు రూ.50 నుంచి రూ.60 వేలు ఉంటుంది. ఈ లెక్కన ఈ భూమి విలువ దాదాపు రూ.100 కోట్లుకు పైగానే ఉంది.
     
    రూ.50 వేలు ఇస్తాం ఖాళీ చేయాలంటున్నారు
    మా తల్లిదండ్రుల నుంచి ఇక్కడే ఉంటున్నాం. నేను ఇక్కడే పుట్టాను. చిన్నబడ్డీ కొట్టు పెట్టుకుని బతుకుతున్నాం. ఇప్పటికిప్పడు ఎవరో వచ్చి ఈ స్థలం మేము కొన్నాం ఖాళీ చేయాలంటున్నారు. రూ.50వేలు ఇస్తారు ఖాళీ చేయక తప్పదంటూ మా డివిజ¯ŒS కార్పొరేటర్‌ తంగెళ్ల బాబి నా వద్దకు పదిసార్లు వచ్చారు. బడ్డీకొట్టుకు నగర పాలక సంస్థ పన్ను వేస్తోంది. కరెంటు బిల్లు కడుతున్నాం. దీనిపై మేము కోర్టుకు వెళుతున్నాం. 
    – తురాయి సూర్యనారాయణరావు, ఆదెమ్మదిబ్బ వాసి
    ఈ వయస్సులో ఎక్కడిపోవాలయ్యా?
    50 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. ఇళ్లలో పాచిపనులు చేసుకుని జీవిస్తున్నాం. ఇప్పుడు ఈ గూడు కూడా పోతే మాకు దిక్కెంటి? నా కుమారుడికి మతిస్థిమితం లేదు. కోడలు చనిపోయింది. ఏడేళ్ల నా మనవడితో ఎక్కడికిపోవాలి. ఎవరో ఈ స్థలం కొన్నారని మా గుడిసెలు తొలగిస్తున్నారు. మాకు డబ్బులు ఇస్తామంటున్నారు.
    – మీసాల సత్యవతి, ఆదెమ్మదిబ్బ వాసి.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement