సమష్టిగా కుష్టు వ్యాధిని నిర్మూలిద్దాం | leprosy shelling with unity | Sakshi

సమష్టిగా కుష్టు వ్యాధిని నిర్మూలిద్దాం

Jan 30 2017 11:17 PM | Updated on Sep 5 2017 2:29 AM

సమష్టిగా కుష్టు వ్యాధిని నిర్మూలిద్దాం

సమష్టిగా కుష్టు వ్యాధిని నిర్మూలిద్దాం

చేయి చేయి కలుపుదాం–కుష్టు వ్యాధిని నిర్మూలిద్దామని డీఎం అండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ మీనాక్షి మహదేవన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

 – జాతీయ కుష్టు వ్యతిరేక దినోత్సవ ర్యాలీలో డీఎంఅండ్‌హెచ్‌ఓ
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : చేయి చేయి కలుపుదాం–కుష్టు వ్యాధిని నిర్మూలిద్దామని డీఎం అండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ మీనాక్షి మహదేవన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని   జాతీయ కుష్టు వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో  భాగంగా   ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిన  నుంచి జిల్లా పరిషత్‌ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ కుష్టువ్యాధి నిర్మూలనకు కృషి చేస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.
 
ఈ సందర్భంగా డీఎంఅండ్‌హెచ్‌ఓ మాట్లాడుతూ..వ్యాధి గ్రస్తులు భయపడాల్సిన అవసరం లేదని మల్టీ డ్రగ్‌ «థెరపీ(ఎండీటీ) పద్ధతిలో సులభంగా నయం చేసుకోవచ్చన్నారు. అంతకుముందు నిలయం స్వచ్ఛంద సంస్థ కళాకారుల బృందం పాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్యాధికారి రూపశ్రీ, అధికారులు అంకిరెడ్డి, శివశంకరరావు, పీటీ మనోహర్, గీతాంజలి నర్సింగ్, కేవీఆర్‌ కళాశాలల విద్యార్థులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement