తాగుబోతుకు అత్తింట పరాభవం | locals Thrashes drunk | Sakshi
Sakshi News home page

తాగుబోతుకు అత్తింట పరాభవం

Published Wed, Oct 12 2016 9:29 AM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM

locals Thrashes drunk

సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో ఓ తాగుబోతు కానిస్టేబుల్‌కు గ్రామస్తులు తగ్గిన బుద్ధి చెప్పారు. నిత్యం వేధిస్తుండటంతో దసరా పండుగపూట ఇంటికి పిలిచి దేహశుద్ధి చేశారు. ముస్తాబాద్ మండలం గూడూరుకు చెందిన కానిస్టేబుల్ అశోక్‌కు ముస్తాబాద్‌కు చెందిన అనితతో రెండు నెలల క్రితమే వివాహం అయింది. పెళ్లయినప్పటి నుంచి అశోక్ నిత్యం తాగివచ్చి భార్యను చిత్రహింసలు పెడుతున్నాడు. సైకోలా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయమై అనిత కుటుంబసభ్యులకు తెలిపింది. మంగళవారం పండుగ అత్తవారింటికి మద్యం మత్తులో వచ్చిన అశోక్‌ను కుటుంబసభ్యులు నిలదీశారు. అతడు ఎదురు తిరగటంతో గ్రామస్తుల సాయంతో స్తంభానికి కట్టేసి భార్య సహా అందరూ అతడిని చితకబాదారు. ఆపైన, గ్రామంలో ఊరేగించి పోలీసులకు అప్పగించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement