తల్లాడ(ఖమ్మం జిల్లా): ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక మండలం నూతన్‌కల్ వద్ద బైక్‌ను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. మృతులను పెనుబల్లి మండలం దుబ్బాయిగూడెం గ్రామానికి చెందిన రావూరి శ్రీనివాస్, రావూరి రవిలు గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.