ఆదిలాబాద్ : ట్యాక్స్ పేపర్లు లేకుండా అక్రమంగా పసుపు, కారం బట్టలు ఉతికే సర్ఫ్ తరలిస్తున్న లారీని పోలీసులు సీజ్ చేశారు. ఈ సంఘటన ఆదిలాబాద్లోని స్థానిక నటరాజ్ థియేటర్ సమీపంలో శుక్రవారం జరిగింది. సరుకులతో వెళ్తున్న లారీని ఆపిన పోలీసులు ట్యాక్స్ పేపర్లు చూపించాలని లారీ డ్రైవర్ను కోరారు.
పేపర్లు లేవని డ్రైవర్ తెలపడంతో పోలీసులు ఆదాయపు పన్ను అధికారులకు సమాచారం అందించారు. సదరు అధికారులు లారీని సీజ్ చేశారు. సీజ్ చేసిన సరుకు సుమారు రూ. 3 లక్షల ఉంటుందని అధికారులు వెల్లడించారు. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.