
టీడీపీ మహిళా నేత శ్రీదేవి ఆత్మహత్య
మాచర్ల(గుంటూరు): గుంటూరు జిల్లా మాచర్ల మున్సిపాలిటీ మాజీ చైర్ పర్సన్, టీడీపీ మహిళా నేత శ్రీదేవి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నేటి ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీదేవి నేటి ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శ్రీదేవి మృతిచెందారు.
మాచర్ల మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా పనిచేసిన శ్రీదేవికి టీడీపీ పెద్దల నుంచి రాజకీయ ఒత్తిళ్లు అధికమయ్యాయి. దీంతో ఆమె నాలుగు నెలల కిందటే ఆ పదవి నుంచి తప్పుకున్నారు. చైర్ పర్సన్ పదవి పంపకాల విషయంలో శ్రీదేవి దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో మూడు నెలల కిందట ఆమె భర్త మల్లికార్జునరావు గుండెపోటుతో మృతిచెందారు. ఓ వైపు పదవి కోల్పోవడంతో పాటు భర్త మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన శ్రీదేవి నేటి ఉదయం పరుగుల మందు తాగి ఆత్మాహత్యాయత్నం చేశారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (చదవండీ: డామిట్.. కథ అడ్డం తిరిగింది..!)