- వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి
- రేష¯ŒS పోర్టుబులిటీ విధానంపై గళమెత్తిన ప్రజలు
- రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాధర్నా
పేదల ఆకలి బాధలు ఈ ప్రభుత్వానికి పట్టవా..
Published Tue, Nov 29 2016 11:30 PM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM
దానవాయిపేట (రాజమహేంద్రవరం) :
రేష¯ŒS అందక పేదలు పస్తులున్న వారి అకలి బాధలు ప్రభుత్వానికి పట్టవా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజమెత్తారు. నగరంలోని 3,6,5,10,14,20,28,31 డివిజన్లలో సుమారు మూడు నెలలుగా సీజ్ చేసిన చౌకదుకాణాలకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైన అధికారుల తీరుపై పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మేడపాటి షర్మిలా రెడ్డి అధ్వరంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాధర్నా చేశారు. ధర్నాకు పెద్ద ఎత్తున మహిళలు, రేష¯ŒS లబ్ధి్దదారులు హాజరై ప్లకార్డులతో నిరసన తెలిపారు. పార్టీ సిటీ కో అర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు, రూరల్ కో అర్డినేటర్ ఆకుల వీర్రాజు, రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు తదితరులు పాల్గొన్నారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ నగర పరిధిలో సుమారు 8 రేష¯ŒS షాపులను అధికారులు సీజ్ చేసి వాటికి ప్రత్యమ్నాయం చూపడంలో అధికారులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. పోర్టబులిటీని పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికే నోట్ల రద్దుతో ఏటిఎంల వద్ద పడిగాపులు పడ్డుతున్న ప్రజలకు మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్‌ల పేరుతో నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని ప్రభుత్వం సూచిస్తూ ఇబ్బంది పెడుతోందన్నారు. కోఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఉన్న డివిజన్లలోనే రేష¯ŒS నిలిపివేయ్యడం ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు నిదర్శనమన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు మాట్లాడుతూ నోట్ల రద్దుకు ప్రత్యామ్నాయం చూపడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. జిల్లా అధికార ప్రతినిధి షర్మిలా రెడ్డి మాట్లాడుతూ మూడో డివిజ¯ŒSలో రేష¯ŒS సీజ్ చేసిన విషయాన్ని సబ్‌కలెక్టర్‌కు వివరిస్తే నేను చూస్తానని మూడు నెలలైనా కనీసం ఇన్‌చార్జిలను కూడా నియమించలేకపోయారన్నారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్ మాట్లాడుతూ రేష¯ŒS కోల్పోయిన లబ్ధిదారులకు తక్షణం రేష¯ŒS ఇప్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్‌కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి ఎఓ జాన్స¯ŒSకు వినతి పత్రం అందజేశారు. నగరపాలక సంస్థ కార్పొరేటర్లు బోంతా శ్రీహరి, ఈతకోట బాపన సుధారాణి, మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు వాకచర్ల కృష్ణ, భీమవరపు వెంకటేశ్వరావు, తామాడ సుశీల వివిధ విభాగాల రాష్ట్ర, జిల్లా, నగర కమిటీ కార్యదర్శలు, సంయుక్త కార్యదర్శులు సుంకర చిన్ని, దంగేటి వీరబాబు, పోలు కిరణ్ మోహ¯ŒS రెడ్డి, గుర్రం గౌతమ్, మాసా రామ్ జోగ్, మార్తి నాగేశ్వరావు, లంక సత్యనారాయణ, గుదే రఘు నరేష్ నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement