maha darna
-
దద్దరిల్లిన జంతర్‌మంతర్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బీసీల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్న డిమాండ్‌తో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాతో ఢిల్లీలోని జంతర్‌మంతర్ దద్దరిల్లింది. కేంద్ర బడ్జెట్లో బీసీలకు కేవలం రూ. 2 వేల కోట్లు కేటాయించి అన్యాయం చేశారని నిరసిస్తూ బీసీ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘ కనీ్వనర్ లాల్ కృష్ణ, ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ నరేశ్, రాజ్‌కుమార్, ఢిల్లీ అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్ నాయకత్వం వహించిన మహాధర్నాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, బీఆర్ఎస్ ఎంపీలు కె.కేశవరావు, బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొని ప్రసంగించారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి హాజరైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మహాధర్నాను ఉద్దేశించి ప్రసంగిస్తూ, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. బీసీలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ.. రాజకీయ రిజర్వేషన్లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించి బీసీలను విస్మరించారని మండిపడ్డారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 22 మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారని.. రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 20 జిల్లాల నుంచి ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 129 బీసీ కులాలకుగాను 120 కులాలు ఇంతవరకు అసెంబ్లీ గడప తొక్కలేదన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 175 మంది ఎమ్మెల్యేల్లో 38 మంది బీసీ ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని తెలిపారు. ఈ దేశంలో బీసీలను బిచ్చగాళ్లను చేశారని ఆర్.కృష్ణయ్య విమర్శించారు. గత 35 సంవత్సరాల్లో 70సార్లు పార్లమెంటు వద్ద ధర్నాలు– ప్రదర్శనలు నిర్వహించామని... శాంతియుతంగా ఉద్యమిస్తే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలి: కేకే కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు డిమాండ్ చేశారు. ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంటే పథకాలు వేగంగా అమలు జరుగుతాయని అన్నారు. ఈ విషయమై పార్లమెంటులో ప్రస్తావించి పోరాటం కొనసాగిస్తామని కేకే తెలిపారు. బీసీ జనాభా లెక్కించాలన్న డిమాండ్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు. తెలంగాణను చూసి కేంద్ర ప్రభుత్వం నేర్చుకోవాలని లింగయ్య యాదవ్ అన్నారు. -
ఐఆర్డీఏ డ్రాఫ్ట్ ఉపసంహరించేదాకా పోరు
కవాడిగూడ (హైదరాబాద్): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏ) డ్రాఫ్ట్‌ను ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా ఎల్ఐసీ ఏజెంట్లు పెద్దఎత్తున ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థను ఆగ్రభాగాన నిలబెట్టడంలో ఎల్ఐసీ ఏజెంట్ల పాత్ర మహోన్నతమైందని పేర్కొన్నారు. ఎల్ఐసీ ఏజెంట్ల సమస్యలను దేశ ప్రధాని, తెలంగాణ సీఎంలకు లేఖల ద్వారా పంపించి వివరిస్తామన్నారు. శుక్రవారం ఎల్ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీఏవోఐ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల నుంచి వేలాదిమంది ఎల్ఐసీ ఏజెంట్లు ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌ఐసీఏవోఐ ఆలిండియా ప్రధాన కార్యదర్శి దిలీప్ మాట్లాడుతూ ఐఆర్డీఏ డ్రాఫ్ట్ వల్ల ఎల్ఐసీ ఏజెంట్ల మనుగడకే తీవ్రమైన నష్టం కలగడమే కాకుండా ఎల్ఐసీ వ్యవస్థ కనుమరుగయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎల్‌ఐసీఏవోఐ సౌత్ జోన్ అధ్యక్షుడు మంజునాథ్, ప్రధాన కార్యదర్శి నరసింహారావు మాట్లాడుతూ బీమా సంగం పేరుతో ఎల్ఐసీని నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో సీఐటీయూ ఆలిండియా వైస్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ వాసుదేవ్ ఆచార్య, ఏఐఐఈఏ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. -
మరోసారి ఉద్యమించాలి
సాక్షి, హైదరాబాద్/ కవాడిగూడ: బహుళ జాతి సంస్థల ప్రయోజనాల కోసం దేశ వినాశనానికి పాల్పడుతున్న బీజేపీ నుంచి దేశాన్ని రక్షించుకునేందుకు ఆనాటి స్వాతంత్య్ర సంగ్రామ స్ఫూర్తితో మరోసారి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. నిత్యావసర ఆహార వస్తువులపై జీఎస్టీని నిరసిస్తూ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నగరంలోని ఇందిరాపార్క్ వద్ద ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమానికి భట్టి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్, అనేక సంస్థలు, వ్యవస్థలు, ఆస్తుల ఏర్పాటుతో నవభారత నిర్మాణం చేస్తే .. 2014 ఎన్నికల్లో మాయమాటలతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ జాతి సంపదను బహుళ జాతి సంస్థలు, అంబానీ, అదానీలకు ధారాదత్తం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించకుండా కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. నిత్యావసర ఆహార వస్తువులపై జీఎస్టీ విధించి మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజలను ఇబ్బందులు పెడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపైకి ప్రధాని మోదీ ఈడీ, ఐటీ, సీబీఐలను ఉసిగొల్పుతూ అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించే కుట్రలు చేస్తున్నారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఎమ్మెల్యే సీతక్క, అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ తదితరులు మాట్లాడారు. చలో రాజ్‌భవన్ భగ్నం మహాధర్నా అనంతరం టీపీసీసీ నేతలు చలో రాజ్‌భవన్ చేపట్టారు. ఇందిరాపార్క్ నుంచి వందలాది మంది నాయకులు, కార్యకర్తలు జెండాలు చేతపట్టుకుని పెద్ద సంఖ్యలో ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే మూడంచెల భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు వారిని అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ఆందోళనకారులను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించిన పోలీసులు వివిధ స్టేషన్లకు తరలించారు. -
అగ్రిగోల్డ్ బాధితుల కోసం వైఎస్ఆర్సీపీ మహాధర్నా
-
స్టీల్‌ప్లాంట్ కోసం నేడు వైఎస్ఆర్సీపీ మహాధర్నా
-
ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే మహాధర్నా
-
పేదల ఆకలి బాధలు ఈ ప్రభుత్వానికి పట్టవా..
వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి రేష¯ŒS పోర్టుబులిటీ విధానంపై గళమెత్తిన ప్రజలు రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాధర్నా దానవాయిపేట (రాజమహేంద్రవరం) : రేష¯ŒS అందక పేదలు పస్తులున్న వారి అకలి బాధలు ప్రభుత్వానికి పట్టవా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజమెత్తారు. నగరంలోని 3,6,5,10,14,20,28,31 డివిజన్లలో సుమారు మూడు నెలలుగా సీజ్ చేసిన చౌకదుకాణాలకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైన అధికారుల తీరుపై పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మేడపాటి షర్మిలా రెడ్డి అధ్వరంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాధర్నా చేశారు. ధర్నాకు పెద్ద ఎత్తున మహిళలు, రేష¯ŒS లబ్ధి్దదారులు హాజరై ప్లకార్డులతో నిరసన తెలిపారు. పార్టీ సిటీ కో అర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు, రూరల్ కో అర్డినేటర్ ఆకుల వీర్రాజు, రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు తదితరులు పాల్గొన్నారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ నగర పరిధిలో సుమారు 8 రేష¯ŒS షాపులను అధికారులు సీజ్ చేసి వాటికి ప్రత్యమ్నాయం చూపడంలో అధికారులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. పోర్టబులిటీని పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికే నోట్ల రద్దుతో ఏటిఎంల వద్ద పడిగాపులు పడ్డుతున్న ప్రజలకు మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్‌ల పేరుతో నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని ప్రభుత్వం సూచిస్తూ ఇబ్బంది పెడుతోందన్నారు. కోఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఉన్న డివిజన్లలోనే రేష¯ŒS నిలిపివేయ్యడం ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు నిదర్శనమన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు మాట్లాడుతూ నోట్ల రద్దుకు ప్రత్యామ్నాయం చూపడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. జిల్లా అధికార ప్రతినిధి షర్మిలా రెడ్డి మాట్లాడుతూ మూడో డివిజ¯ŒSలో రేష¯ŒS సీజ్ చేసిన విషయాన్ని సబ్‌కలెక్టర్‌కు వివరిస్తే నేను చూస్తానని మూడు నెలలైనా కనీసం ఇన్చార్జిలను కూడా నియమించలేకపోయారన్నారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్ మాట్లాడుతూ రేష¯ŒS కోల్పోయిన లబ్ధిదారులకు తక్షణం రేష¯ŒS ఇప్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్‌కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి ఎఓ జాన్స¯ŒSకు వినతి పత్రం అందజేశారు. నగరపాలక సంస్థ కార్పొరేటర్లు బోంతా శ్రీహరి, ఈతకోట బాపన సుధారాణి, మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు వాకచర్ల కృష్ణ, భీమవరపు వెంకటేశ్వరావు, తామాడ సుశీల వివిధ విభాగాల రాష్ట్ర, జిల్లా, నగర కమిటీ కార్యదర్శలు, సంయుక్త కార్యదర్శులు సుంకర చిన్ని, దంగేటి వీరబాబు, పోలు కిరణ్ మోహ¯ŒS రెడ్డి, గుర్రం గౌతమ్, మాసా రామ్ జోగ్, మార్తి నాగేశ్వరావు, లంక సత్యనారాయణ, గుదే రఘు నరేష్ నాయకులు పాల్గొన్నారు. -
'చంద్రబాబు, కరువు.. కవలలు'
అనంతపురం: చంద్రబాబునాయుడు ఎప్పుడు సీఎం అయినా ఆంధ్రప్రదేశ్‌కి కరువేనని కాంగ్రెస్ నేతలు తులసీరెడ్డి, శైలజానాథ్, రవిచంద్రారెడ్డిలు అన్నారు. చంద్రబాబు నాయుడు, కరువు కవలపిల్లలని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఏపీ కరువుతో అల్లాడుతున్నా బాబు విహారయాత్రల్లో మునిగి తేలుతున్నారని మండిపడ్డారు. ఈ నెల 23న ప్రకాశం బ్యారేజీ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ నేతలు తులసీరెడ్డి, శైలజానాథ్, రవిచంద్రారెడ్డిలు తెలిపారు. -
పెల్లుబికిన ప్రజాగ్రహం...
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి, విశాఖపట్నం) ఎన్నికల హామీలను గాలికొదిలేసిన పాలకపక్షంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. హామీలు మరచిన చంద్రబాబు తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మెడలు వంచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ ఆరంభించిన పోరుబాటలో సాగుతామని స్పష్టం చేశారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వెన్నంటి ఉండి ఉద్యమపథంలో సాగుతామని ప్రతినబూనారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పిలుపుమేరకు శుక్రవారం వేలాదిగా రైతులు, డ్వాక్రా మహిళలు, పార్టీ శ్రేణులు, ప్రజలు కదం తొక్కుతూ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద మహాధర్నాలు నిర్వహించారు. విశాఖ కలెక్టరేట్ వద్ద ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మహాధర్నాకు భారీ ఎత్తున సంఘీభావం ప్రకటించారు. జగన్మోహన్రెడ్డి స్వయంగా పాల్గొంటారని ప్రకటించడంతో విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద మహాధర్నా రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు తగ్గట్లుగానే జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు విశాఖ కలెక్టరేట్‌కు తరలివచ్చారు. మండే ఎండను సైతం లెక్కచేయకుండా, ప్రభుత్వ వేధింపులను వెరవకుండా కదలివచ్చిన భారీ జనసమూహంతో ఉదయం 10గంటలకే కలెక్టరేట్ ప్రాంగణం కిటకిటలాడిపోయింది. మధ్యాహ్నం 1.30 గంటవరకు సాగిన ధర్నా ఆద్యంతం నేతల ప్రసంగాలను ఆసక్తిగా ఆలకించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, నేతలు మాట్లాడుతూ తమ అధినేత మహాధర్నా చేపట్టాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఇక వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రసంగం ఆద్యంతం స్ఫూర్తిదాయకంగా సాగి ధర్నా వాతావరణాన్ని వేడెక్కించింది. జనవరి 6, 7 తేదీల్లో రెండురోజులు నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న 86 మంది రైతుల కుటుంబాలను సంక్రాంతి తరువాత వ్యక్తిగతంగా కలిసి ఓదార్చనున్నానని ప్రకటించడంతో ధర్నా స్థలి చప్పట్లు, ఈలలతో మార్మోగింది. -
ధర్నా పోస్టర్ రిలీజ్ చేసిన వైఎస్ఆర్ సీపీ