సంగమేశ్వరం ఘాట్‌లో మహా మంగళ హారతి
Published Tue, Aug 23 2016 12:46 AM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
కర్నూలు(న్యూసిటీ): సంగమేశ్వరస్వామి ఘాట్‌లో మంగళవారం దేవదాయ ధర్మదాయశాక ఆధ్వర్యంలో కృష్ణానదికి ఆదిపుష్కర ముగింపు మహా మంగళ హారతి మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆశాఖ సహాయ కమిషనర్ సి. వెంకటే శ్వర్లు తెలిపారు. సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో ముందుగా లలిత సంగమేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలకు అవభదస్నానం చేయిస్తామని పేర్కొన్నారు. కృష్ణ పుష్కర బృహస్పతి గాయత్రి యాగం పూర్ణహాతి ముగింపు కార్యక్రమం దేవాలయం ప్రధానఅర్చకులు తెలకపల్లి రఘురామశర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సి. హరికిరణ్ ఆధ్వర్యంలో సాయం సంధ్యాసమయ సంధ్యాహారతి నిర్వహిస్తామన్నారు. పుష్కర విధులను నిర్వహించిన అ«ధికారులు, సిబ్బంది, భక్తులు ఈకార్యక్రమంలో పాల్గొనాలని కార్యనిర్వహణాధికారి కె.కమలాకర్ తెలిపారు.
Advertisement