మంత్రిని కలిసిన రైతు సమితి నాయకులు
- సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు
- తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకల శ్రీహరిరావు
సంగారెడ్డి మున్సిపాలిటీ: మహారాష్ట్ర ప్రభుత్వంతో మన రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం చరిత్రాత్మకమని ఇందుకు సీఎం కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకు రైతుల పక్షన కృతజ్ఞతులు తెలుపుతున్నామని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకల శ్రీహరిరావు అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీశ్‌రావును సన్మానించారు.
ఈ సందర్భంగా శ్రీహరిరావు మాట్లాడుతూ వరుస కరువుతో ఆల్లాడుతున్న రైతులను ఆదుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో మూడు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టేందుకు సీఎం కేసీఆర్ , నీటి పారుదల శాఖ మంత్రి వ్యవహరించిన తీరు ప్రశంసనీయమన్నారు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోని రాష్ట్రంలో పంటలు బాగా పండాలనే ప్రధాన ఉద్దేశంతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు.