వైభవంగా మహావీర్ జయంత్యుత్సవం
వైభవంగా మహావీర్ జయంత్యుత్సవం
Published Sun, Apr 9 2017 10:13 PM | Last Updated on Tue, Sep 5 2017 8:22 AM
రాజమహేంద్రవరంలో భారీ ఊరేగింపు
ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం రూరల్) : భగవాన్ శ్రీ మహావీర్ స్వామీజీ 2616వ జయంతి ఉత్సవాన్ని రాజమహేంద్రవరం సమస్త రాజస్థానీసంఘ్ ఆధ్వర్యంలో ఆదివారం వైభవంగా నిర్వహించారు. స్థానికు గుండువారివీధిలోని జైన మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భగవాన్ మహావీర్ విగ్రహం పల్లకీలో వేలాదిమంది వెంట రాగా మెయిన్ రోడ్, డీలక్స్‌సెంటర్ మీదుగా ట్రైనింగ్ కళాశాలకు చేరుకుంది. జైనులు అతిథుల నుదుట తిలకం దిద్ది ఆప్యాయంగా ఆహ్వానించారు. నిర్వాహకులు మహావీర్ ఎం.జైన్ మాట్లాడుతూ అహింసను మించిన ధర్మం లేదని, సాటి మనుషులనే కాదు, ఏ ప్రాణినీ నొప్పించరాదని అన్నారు. 2616 ఏళ్ళ తర్వాత కూడా భగవాన్ మహవీర్ బోధనల ప్రాధాన్యం తగ్గలేదన్నారు. రాజస్థాన్ ప్రాంతానికి చెంది, రాజమహేంద్రవరంలో స్థిరపడిన 36 ఉపకులాల వారందరినీ ఒకతాటిపైకి తీసుకువచ్చి సోదరభావాన్ని పెంపొందించడం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. నగర ఎమ్మెల్యే డాక్టర్ ఆకులసత్యనారాయణ, మేయర్ పంతం రజనీ శేషసాయి, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, నగర కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, నగరపాలకసంస్థలో ఆ పార్టీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, సీసీసీ ఛానల్ ఎండీ పంతం కొండలరావు, అర్బన్ క్రైం డీఎస్పీ త్రినాథరావు, నగర బీజేపీ అధ్యక్షుడు బొమ్ములదత్తు, ఆర్యాపురం అర్బన్ బ్యాంకుౖ వైస్ చైర్మన్ అయ్యల గోపి, డైరెక్టర్ యెనుముల రంగబాబు, కార్పొరేటర్లు కురగంటి ఈశ్వరి, మాటూరి రంగారావు, ఇన్నమూరి శ్రీరామచంద్రమూర్తి, మాజీ కార్పొరేటర్లు వాకచర్ల కృష్ణ, చోడిశెట్టి సత్యవాణి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బూర్లగడ్డ వెంకటసుబ్బారాయుడు, ఎస్‌వీజీ మార్కెట్ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్.నాగేశ్వరరావు, రాష్ట్ర టీడీపీ కార్య నిర్వాహకకార్యదర్శి గన్ని కృష్ణ, చల్లా శ్రీనివాస్, తోట సుబ్బారావు, మార్గాని భరత్, కాశి నవీన్ కుమార్ తదితరులను శాలువాలతో సత్కరించారు. మోహన్ లాల్‌జైన్, అశోక్‌కుమార్‌జైన్, జైన్, భేరూలాల్‌జైన్, హంసకుమార్‌జైన్, లక్ష్మీనారాయణజవ్వార్, నారాయణసింగ్, నందుజైన్, బాబూ సింగ్, అధికసంఖ్యలో జైనులు పాల్గొన్నారు.
Advertisement